Home Blog

PM Modi on privatisation: వ్యాపారం ప్రభుత్వ పని కాదు.. ప్రైవేటీకరణపై మోదీ సంచలన వ్యాఖ్యలు – pm narendra modi strong comments on privatisation of public sector units

0


నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ తప్పదన్నారు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ. ప్రభుత్వ రంగ సంస్థల్ని స్థాపించిన అప్పటి పరిస్థితులు అవసరాలు వేరన్నారు. ఇప్పటి పరిస్తితులు వేరన్నారు. 70 ఏళ్ల పరిస్థితులతో పోల్చితే.. ఇప్పుడు పూర్తిగా మారయన్నారు మోదీ. ప్రభుత్వ రంగ సంస్థల్ని నడపలేమన్నారు. వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదన్నారు ప్రధాని. కొంతమందికి మాత్రమే ఉపయోగపడే ప్రభుత్వ రంగ సంస్థల్ని నడపలేమని ఆయన తేల్చేశారు.

వీటి కోసం పన్ను చెల్లింపు దారుల సొమ్మును ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నారు మోదీ. పీఎస్‌యూల ఆర్థిక పరిపుష్టికి సాయం అందించడం భారమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వారసత్వంగా వస్తున్నాయి కదా అని నష్టాల్లో ఉన్న సంస్థల్ని నడపలేమని ఆయన తేల్చి చెప్పేశారు. ప్రజా ధనాన్ని సరిగా వినియోగించుకోవాలన్నారు. పేదల కోసం వినయోగించాల్సిన డబ్బును నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్ర మద్దతు అవసరమే అన్నారు. కానీ వాటిని ప్రభుత్వమే నడపాల్సిన అవసరం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అసవరం లేదన్నారు మోదీ.

ప్రధాని వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే.. విశా స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఉక్కు పిడుగు మోపినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఆందోళనలు చేసినా ఉద్యమించినా పట్టించుకునే పరిస్థితి లేదని పరోక్షంగా కేంద్రం తేల్చేసింది.ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇక నడపలేమంటున్న మోదీ కామెంట్స్‌తో… విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేగవంతం చేసిందని అర్థమవుతోంది. మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ బిడ్‌కు కూడా మోదీ సర్కార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

chiranjeevi: ‘ఆచార్య’ సెట్స్‌పై చిరంజీవి, రామ్ చరణ్.. మారేడిమిల్లి ఫారెస్ట్‌లో అలా! వీడియో వైరల్ – acharya: chiranjeevi- ram charan at shooting spot

0


ప్రధానాంశాలు:

  • చిరంజీవి- కొరటాల శివ కాంబోలో ‘ఆచార్య’
  • సామాజిక కోణంలో మూవీ
  • మారేడిమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఆచార్య’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చెప్పిన డేట్ మే 13 కల్లా ఎలాగైనా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ అంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లి అటవీ ప్రాంతంలో ఈ చిత్ర షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియో బయటకురావడంతో నెట్టింట వైరల్‌గా మారింది.

మారేడిమిల్లి ఫారెస్ట్‌లో ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ని ప్లాన్ చేసిన కొరటాల అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా భాగమవుతున్నారు. దీంతో షూటింగ్ స్పాట్ వద్ద మెగా అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ వీడియో, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవి, రామ్ చరణ్‌ లుక్ స్పష్టంగా తెలుస్తోంది. వీడియో చూసిన వారంతా ఈ వేసవిలో ‘ఆచార్య’ మెగా ట్రీట్‌ మాములుగా ఉండదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
‘శ్యామ్ సింగ రాయ్’ ఫస్ట్ లుక్: బ్రిటిష్ ఇండియాలో నాని.. వింటేజ్ లుక్ అదిరింది!
దర్శకుడు కొరటాల శివ సామాజిక కోణంలో ఈ ‘ఆచార్య’ మూవీ రూపొందిస్తున్నారు. చిత్ర నిర్మాణంలో భాగం కావడంతో పాటు ‘సిద్ద’ అనే కీలకపాత్ర పోషిస్తున్నారు రామ్ చరణ్. ఈ పాత్ర సినిమాను మలుపుతిప్పేదిగా ఉంటుందని సమాచారం. తండ్రీ కొడుకులు వెండితెరపై కనిపించబోతుండటంతో మెగా అభిమానులు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది.

rahul gandhi swimming: నడి సముద్రంలో ఈత కొట్టిన రాహుల్ గాంధీ .. వీడియో వైరల్ – rahul gandhi swimming in sea with fishermen at kerala

0


ఎప్పుడూ పాలిటిక్స్‌తో బిజీగా ఉండే రాహుల్ అప్పుడప్పుడు సరదాగా కొన్ని కొన్ని పనులు చేస్తూ వార్తాల్లో నిలుస్తారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తాజాగా స్విమ్మర్‌‌గా మారారు. మత్స్యకారులతో కలిసి ఆయన సముద్రం మధ్యలో ఈత కొట్టారు. మత్స్యకారుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి రాహుల్‌ కేరళలోని కొల్లాం తీరంలో బుధవారం పర్యటించారు. వాడి బీచ్ నుంచి మత్స్యకారులతో కలిసి ఆయన సముద్రంలోకి వెళ్లారు. ఓ పడవలో సముద్రంలోకి వెళ్లిన ఆయన చేపలను పట్టేందుకు వల కూడా విసిరారు.

అనంతరం మత్స్యకారులతో పాటు సముద్రంలోకి దూకి అందరినీ ఆశ్చర్యపరిచారు. మధ్యలో హఠాత్తుగా పడవలో నుంచి సముద్రంలో దూకి జాలర్లతో కలిసి ఈతకొట్టారు. దాదాపు పది నిమిషాల పాటు రాహుల్ సముద్రం నీటిలో ఈత కొట్టారు. రాహుల్ ఈత కొట్టిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎవరితో చెప్పకుండా రాహుల్ ఒక్కసారిగా సముద్రంలోకి హఠాత్తుగా దూకడంతో భయపడినట్లు చెప్పారు కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. పడవ తిరిగి ఒడ్డుకు చేరాక.. థంగస్సెరీ బీచ్‌ దగ్గర మత్స్యకారులను ఉద్దేశించి రాహుల్‌ ఉద్వేగ భరితంగా మాట్లాడారు.

కేరళలో అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం చేపలు పట్టడానికి సముద్రంలో ట్రాలర్లు ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చు కోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ ఒప్పందం వల్ల జాలర్లు జీవనోపాధిని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. జాలర్లు ఎంత కష్టపడతారో తనకు ఇవాళ అర్థం అయ్యిందన్నారు. మత్స్యకారుల పనిని తాను ఎంతో గౌరవిస్తాను, ఆరాధిస్తానని తెలిపారు రాహుల్ గాంధీ. చేపలు దొరికితే తామంతా లొట్టలేసుకుంటూ తింటూ ఉంటాం. కానీ అవి మా ప్లేట్‌లోకి రావడానికి మత్స్యకారులు ఎంత కష్టపడుతున్నారో ఇవాళే తనకు అర్థం అయ్యిందంటూ రాహుల్‌ అన్నారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

previous birth in dream: పీడ కల: ఇతడి గత జన్మ తెలిసింది.. నమ్మరా? వీడియో చూడండి, షాకవుతారు! – man tiktok video on dream goes viral, he finds unusual similarity with a man died 500 years ago appeared in dream

0


సాధారణంగా నిద్రలో చాలా మందికి కలలు వస్తుంటాయి. వాటిలో మంచి కలలు ఉంటాయి. చెడు కలలు ఉంటాయి. నిద్రలోనే చెమటలు పట్టించే పీడ కలలు కూడా ఉంటాయి. అలాంటి కలలు వచ్చినప్పుడు నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తారు. ఒళ్లంతా చెమటలు పట్టేస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ, మెలకువ వచ్చిన తర్వాత అంతా శూన్యం. అదంతా వట్టి కలేనని తెలుసుకొని మామూలు స్థితికి వచ్చేస్తాం. కానీ, ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్న యువకుడికి మాత్రం టెర్రిఫిక్ కల వచ్చింది. ఆ కలలో కనిపించిన కొన్ని విషయాలను గూగుల్ చేస్తే 500 ఏళ్ల కిందటి జన్మ గుర్తొచ్చింది. నమ్మకం కుదరట్లేదా.. అతడు షేర్ చేసిన ఈ వీడియోను చూడండి. ఆ చివరి క్షణాన్ని చూస్తే.. మీరు కూర్చున్న చోట నుంచి ఉలిక్కిపడి లేస్తారు!

రాబర్ట్ టోల్పీ (Robert Tolppi) అనే ఈ యువకుడు తన ట్విటర్ ఖాతా ద్వారా తరచూ టిక్ టాక్ వీడియోలు (TikToker) పోస్టు చేస్తాడు. ఈసారి అతడు షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. అందులో అతడు తనకు వచ్చిన గల గురించి చెప్పాడు. ఆ కల అందరికీ వచ్చినట్టుగా లేదు మరి! అతడి గతజన్మతో సంబంధం ఉంది.

రాబర్ట్ తాను షేర్ చేసిన వీడియోలో తనకు వచ్చిన కల గురించి ఇలా చెప్పుకొచ్చాడు. ‘గత రాత్రి నాకో కల వచ్చింది. ఆ కలలో నేను చచ్చిపోతున్నా.. నా శరీరం మంటల్లో కాలిపోతోంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేచా. నా ఒళ్లంతా చెమటలు పట్టాయి. కలలో నాకొక రేఖాచిత్రం కనిపించింది. దాని మీదున్న అక్షరాలు, నంబర్లు నాకు బాగా గుర్తున్నాయి. అది: A-14Z29’

‘వెంటనే ‘A-14Z29’ అక్షరాలను గూగుల్‌ చేశా. కానీ, దానికి సంబంధించి నాకు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. ఈ విషయంలో నా స్నేహితురాలు నాకు ఏదైనా సాయం చేయవచ్చని భావించా. వెంటనే ఆమెను సంప్రదించా. ఆ నంబర్ గురించి ఆమెకు చెప్పా..’ అంటూ రాబర్ట్ తన కల గురించి చెప్పుకొచ్చాడు.

‘అది పోర్ట్రేయిట్ ట్యాగ్ (Portrait Tag = వ్యక్తుల ఐడెంటిటీ, వివరాలు పొందుపరచడానికి కేటాయించే నంబర్) అయుండొచ్చని నా స్నేహితురాలు చెప్పింది. వెంటనే ఆమె తన కంప్యూటర్ వద్దకు పరుగెత్తింది. ఆ దిశగా సెర్చ్ చేసింది. అవును.. ఆమె అనుమానమే నిజమైంది’ అని రాబర్ట్ చెప్పాడు.

‘ఆ నంబర్ 500 ఏళ్ల కిందట చనిపోయిన ఓ వ్యక్తికి సంబంధించినది. అతడు స్మాల్ ఫాక్స్ (మశూచి, అమ్మవారు) వ్యాధి కారణంగా మరణించాడు. నన్ను ఆశ్చర్యానికి గురి చేసిన అంశం ఏమిటంటే.. అతడి ఫోటో చూడండి. అసాధారణమైన పోలిక’ అంటూ రాబర్ట్ తన వీడియో ముగించాడు.

అవును.. రాబర్ట్ షేర్ చేసిన ఆ వీడియోలోని 500 ఏళ్ల కిందటి వ్యక్తి స్వల్ప మార్పులతో అచ్చూ అతడి (రాబర్ట్)లానే ఉన్నాడు. ఆ ఫొటోను చూసిన తర్వాత షాక్‌కు గురయ్యామని చాలా మంది నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. రాబర్ట్ షేర్ చేసిన వీడియో నిడివి కేవలం 28 సెకండ్లు మాత్రమే. కానీ, అదిప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

‘హే రాబర్ట్.. ఇది నన్ను చాలా భయపెడుతోంది. ఇది నిజం కాదు కదా’ అంటూ ఓ నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘నువ్వు జోక్ చేస్తున్నావా.. అలాగైతే వెంటనే నిజం చెప్పు. నాకు చాలా భయంగా ఉంది’ అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టాడు. ‘వామ్మో.. నా శరీరం భయంతో వణికిపోతోంది’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

కలలో జరిగే విషయాలు మరుసటి రోజుకు గుర్తుండవు.. అదంతా ట్రాష్ అని కొంత మంది కొట్టి పారేస్తున్నారు. కానీ, కొంత మందికి కలలో వచ్చిన విషయాలన్నీ గుర్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ నిద్రపోయే ముందు తమకు కలలో వచ్చే విషయాలు గుర్తుండాలి అని గట్టిగా అనుకునే వారికి కచ్చితంగా గుర్తుంటాయట. ఇంకొంత మందైతే.. తమకు కలలో కనిపించిన విషయాలను మెలకువ వచ్చిన వెంటనే నోట్ చేసుకోవడానికి పడక పక్కన బుక్, పెన్ను కూడా పెట్టుకుంటారని చెప్తున్నారు. రాబర్ట్ వీడియో చూసిన తర్వాత మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో కామెంట్లలో రాయండి మరి..

Bengaluru road accident: భయానక యాక్సిడెంట్: క్షణాల్లో ఎంత ఘోరం జరిగిందో చూడండి.. – on cam: speeding car rams into two-wheeler in bengaluru, 2 killed

0


యానక రోడ్డు యాక్సిడెంట్ ఇది. అతివేగంగా వచ్చిన కారు ఒకటి బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కారు వేగానికి బైక్‌తో పాటు దాని మీద ఉన్న ఇద్దరు యువకులు అమాంతం ఎగిరిపడ్డారు. 100 మీ. దూరం ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఆ షాకింగ్ దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

బైక్‌ను ఢీకొట్టిన తర్వాత కారు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు. బెంగళూరులోని తుమకూరు ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించిన ఇద్దరు యువకులు ఓ ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్నారు. బైక్‌పై ప్రయాణిస్తూ రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం (ఫిబ్రవరి 23) రాత్రి 1.20 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

షాకింగ్ యాక్సిడెంట్.. వామ్మో, ఎగిరి ఎంతదూరం పడ్డారూ?!

బైక్ నడిపే వ్యక్తి.. కారు వేగాన్ని గమనించి, ప్రమాదాన్ని ఊహించి రోడ్డు మధ్యలో ఆగిపోయాడు. కానీ, కారు నేరుగా బైక్ మీదకు వచ్చి ఢీకొట్టింది. అంతే.. క్షణాల్లో వారిద్దరూ అదృశ్యమయ్యారు. బైక్ తునాతునకలైంది. ప్రమాదం జరిగిన తీరుకు అక్కడే ఉన్న కొంత మంది షాక్‌కు గురయ్యారు. ఇళ్లలోంచి బయటకు పరుగెత్తుకొచ్చి చూశారు. అప్పటికే కారు డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

bharat bandh: పెట్రో ధరల మంట.. 26న భారత్ బంద్ – indian traders body calls for bharat bandh on february 26 to protest against rising fuel prices and gst

0


పెరుగుతున్న పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతమవుతున్నాయి. ఫిబ్రవరి 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ట్రేడర్స్ పిలుపునిచ్చిన ఈ బంద్‌లో దేశవ్యాప్తంగా 40 వేల ట్రేడ్ అసోసియేషన్స్ నుంచి సభ్యులు ఆందోళనల్లో పాల్గొననున్నారు. సుమారు 8 కోట్ల మంది ఈ బంద్‌లో పాల్గొనే అవకాశం ఉంది. రైతుల మాదిరిగా జాతీయ రహదారుల దిగ్బంధించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. వీరికి పలు వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.

పెట్రోలియం ధరలతో పాటు ఇ-వే బిల్లు నిబంధనలు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) తదితర అంశాలకు వ్యతిరేకంగా ఈ బంద్‌ చేపట్టనున్నారు. కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ పిలుపునిచ్చిన ఈ బంద్‌కు పలు కార్మిక సంఘాలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. దీంతో పాటు అఖిల భారత వాహనదారుల సంక్షేమ సంఘం (ఆలిండియా ట్రాన్స్‌పోర్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌-ఏఐటీడబ్ల్యూఏ) కూడా సంపూర్ణ మద్దతు పలికింది.

ఈ బంద్‌కు అన్ని రాష్ట్ర స్థాయి వాహనదారుల సంఘాలు మద్దతు ఇస్తాయని ఏఐటీడబ్ల్యూఏ అధ్యక్షుడు మహేంద్ర ఆర్య తెలిపారు. డీజిల్‌ ధరలు తగ్గించాలని.. దేశవ్యాప్తంగా ఒకే రకమైన ధరలు ఉండాలని ఆయన కోరారు. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ‘చక్కా జామ్‌’ తరహాలో రహదారుల దిగ్బంధనం చేపడతామని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) ప్రకటించింది.

పెట్రోల్‌ ధర ఇప్పటికే సెంచరీ మార్క్ దాటిన విషయం తెలిసిందే. డీజిల్‌ ధరలు కూడా దీనికి పోటీ పడుతూ పెరుగుతున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నానాటికీ పెరుగుతున్న ఇందన ధరలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Nithiin: Check Movie: పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్.. ఆయన్ని వాడుకునే స్కోప్ ‘చెక్‌’లో లేదు: నితిన్ ఇంటర్వ్యూ – hero nithin interview about check movie

0


ప్రధానాంశాలు:

  • హీరో నితిన్ లేటెస్ట్ ఇంటర్వ్యూ
  • చెక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నితిన్
  • ఫిబ్రవరి 26న గ్రాండ్ రిలీజ్
  • చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ

యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన సినిమా ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లు. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానున్న నేపథ్యంలో పాత్రికేయ నితిన్‌ సమావేశమయ్యారు. నితిన్‌ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు…

‘చెక్‌’ సినిమా ఎలా మొదలైంది?
– ‘భీష్మ’ సినిమా అంగీకరించిన సమయంలోనే ‘చెక్‌’ అంగీకరించా. ఒక కమర్షియల్‌ సినిమా, ఒక డిఫరెంట్‌ సినిమా చేయాలనే ఆలోచనతో ఈ సినిమాకు ఓకే చెప్పా. లాస్ట్‌ ఇయర్‌ ‘భీష్మ’ విడుదలైంది. తర్వాత లాక్‌డౌన్‌ రావడంతో ‘చెక్‌’ చిత్రీకరణ ఆలస్యమైంది.

డిఫరెంట్‌ సినిమాలు, ప్రయోగాలు చేయాలని ఎప్పుడు అనిపించింది?
– ‘శ్రీనివాస కల్యాణం’ తర్వాత! మూడు ఫ్లాపులు రావడంతో ఓ కమర్షియల్‌ సినిమా, మరో డిఫరెంట్‌ సినిమా చేయాలని డిసైడ్‌ అయ్యా. డిఫరెంట్‌ సినిమాలు తీయడంతో చంద్రశేఖర్‌ యేలేటిగారు మాస్టర్‌ కాబట్టి ‘చెక్‌’ ఒప్పుకొన్నా.

చంద్రశేఖర్‌ యేలేటిగారు ‘చెక్‌’ స్ర్కిప్ట్‌, మీ క్యారెక్టర్‌ చెప్పినప్పుడు ఏమనిపించింది?
– ఫస్ట్‌ వేరే కథ చెప్పారు. ఆ స్క్రిప్ట్ లైన్‌ బావుంది. రెండు నెలలు ట్రావెల్‌ చేశాం. అయితే, ఆ స్క్రిప్ట్‌ మీద ఆయన అంత కాన్ఫిడెంట్‌గా లేరు. నాకూ అంత కాన్ఫిడెన్స్‌ రాలేదు. మళ్లీ రెండు నెలలు గ్యాప్‌ తీసుకుని వచ్చి ‘చెక్‌’ స్క్రిప్ట్‌ చెప్పారు. లైన్‌ చెప్పగానే ఇన్‌స్టంట్‌గా నచ్చింది. కథలో ఎక్కువ శాతం జైలులో జరుగుతుంది. సాంగ్స్‌ లేవు. రొమాంటిక్‌, కామెడీ ట్రాక్స్‌ లేవు.

అసలు, కథేంటి?
– ఆదిత్య జీవిత ప్రయాణమే ‘చెక్‌’. అతను జైలులో ఉండే ఓ ఖైదీ. చెస్‌ నేర్చుకుని ఎలా గ్రాండ్‌ మాస్టర్‌ అయ్యాడు? అనేది సినిమా. చంద్రశేఖర్‌ యేలేటిగారు కథ చెప్పినప్పుడు నాకు క్లైమాక్స్‌ నచ్చింది. లాస్ట్‌ 15 మినిట్స్‌ హైలైట్‌. అక్కడ యేలేటిగారి మార్క్‌ అంతా కనిపిస్తుంది.

కొత్త నితిన్‌ను చూస్తారని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు!
– అవును. నా యాక్టింగ్‌ కొత్తగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. సినిమా చాలామంది చూశారు. వందమంది చూస్తే, వందమందికీ నచ్చింది. అందరూ బావుందని చెప్పారు.

ఎక్కువశాతం సినిమా జైలులో జరుగుతుంది కాబట్టి క్యారెక్టర్‌ కోసం ప్రత్యేకంగా ఏమైనా ప్రిపేర్‌ అయ్యారా?
– లేదండీ. సెట్‌కి వెళ్లాక యేలేటిగారు ఏం చెబితే అది ఫాలో అయ్యా. ‘భీష్మ’, ‘రంగ్‌ దే’ సెట్స్‌లో కాస్త జోవియల్‌గా ఉండేవాణ్ణి. ‘చెక్‌’ సెట్‌లో మాత్రం కామ్‌గా ఉండేవాడ్ని. జైలులో ఖైదీ క్యారెక్టర్‌ కాబట్టి సెట్‌ వాతావరణం అంతా డార్క్‌గా ఉండేది. షాట్‌ చేయడం, తర్వాత పక్కకి వెళ్లి కామ్‌గా కూర్చోవడం… అంతే!

కొత్త క్యారెక్టర్లు చేసినప్పుడు రీసెర్చ్‌ చేస్తారు కదా! మీరు?
– నేనేం చేయను. నా డైరెక్టర్లను ఫాలో అవుతా. డైరెక్టర్లు ఏం చేబితే… అది ఫాలో అవుతా. దర్శకులందరూ మంచివాళ్లు.

రాజమౌళిగారు ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో మీ గురించి గొప్పగా చెప్పారు. మీ ఫీలింగ్‌ ఏంటి?

– ఇట్‌ ఫీల్స్‌ గ్రేట్‌. రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడి నుంచి కాంప్లిమెంట్స్‌ రావడం గ్రేట్‌.

సినిమాలో మీరు డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారా? ట్రైలర్‌ చూస్తే అలా…
– లేదు లేదు. నాది సింగిల్‌ రోలే. ఫ్లాష్‌బ్యాక్‌ పార్ట్‌ ఉంది. అందులో కలర్‌ఫుల్‌ కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తా.

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌తో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌?
– వెరీ నైస్‌. తెలుగులో ఆమెకు తొలి సినిమా ఇది. చాలా బాగా నటించింది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి?
– యాక్చువల్లీ… రకుల్‌కి థ్యాంక్స్‌ చెప్పాలి. సినిమాలో తను లాయర్‌ రోల్‌ చేసింది. తనకు, నాకు మధ్య సాంగ్స్‌ లేవు. రొమాంటిక్‌ ట్రాక్‌ లేదు. ఓ మంచి క్యారెక్టర్‌లో నటించడానికి ముందుకు వచ్చింది. సినిమాలో ఇంపార్టెంట్‌ రోల్‌ ప్లే చేసింది.

భవ్య క్రియేషన్స్‌ సంస్థలో తొలిసారి సినిమా చేశారు. ఈ బ్యానర్‌లో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌?
– ఇటువంటి సినిమాను ప్రొడ్యూస్‌ చేయడం గ్రేట్‌. ఇది రెగ్యులర్‌ సినిమా కాదు. డిఫరెంట్‌ సినిమా. ఇటువంటి సినిమాలకు ఖర్చు పెట్టవచ్చు. అయితే, ఓ పది కోట్లు లేదా కొంత పెడతారు. కానీ, భారీ బడ్జెట్‌తో సినిమా ప్రొడ్యూస్‌ చేసిన ఆనందప్రసాద్‌గారు గ్రేట్‌ అని చెప్పాలి. సినిమా బాగా ఆడి వాళ్లకు డబ్బులు బాగా రావాలని కోరుకుంటున్నాను.

‘చెక్‌’ వంటి సినిమాకు రీ–రికార్డింగ్‌ ఇంపార్టెంట్‌. కల్యాణీ మాలిక్‌ ఎలా చేశారు?
– రీ–రికార్డింగ్‌తో సినిమాను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకువెళ్ళారు. ఆయన అంత మంచి మ్యూజిక్‌ ఇచ్చారు.

సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయిన ఫస్ట్‌ వీక్‌ ఎక్కువ టేక్స్‌ తీసుకున్నారట?
– అవును. యేలేటిగారి స్టయిల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ వేరు. అర్థం చేసుకోవడానికి ఓ వారం పట్టింది. అప్పుడు ఎక్కువ టేక్స్‌ తీసుకున్నా. తర్వాత ఈజీగా చేశా. ‘జయం’ తర్వాత అన్ని ఎక్కువ టేక్స్‌ తీసుకున్నది ఈ సినిమాకే. ఐటెమ్‌ సాంగ్స్‌, రొమాంటిక్‌ సాంగ్స్‌, కామెడీ ఎపిసోడ్స్‌ వంటివి ఏమీ ఉండదు. సినిమా అంతా కంటెంట్‌ ఉంటుంది. లాక్‌డౌన్‌లో ప్రజలందరూ ఓటీటీల్లో డిఫరెంట్‌ సినిమాలు చూశారు. వాళ్ళు కూడా డిఫరెంట్‌ సినిమాలు కోరుకుంటున్నారు. తప్పకుండా ఈ సినిమా జనాలకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాకు సీక్వెల్‌ చేసే ఐడియా ఉంది. క్లైమాక్స్‌ చూస్తే మీకూ అర్థమవుతుంది.

ఈ సినిమా చేయడం రిస్క్‌ అనిపించలేదా?
– రెండేళ్ల క్రితం అయితే రిస్క్‌ ఏమో! ఇప్పుడు ఆడియన్స్‌ డిఫరెంట్‌ సినిమాలు, ఓటీటీలో కొత్త కంటెంట్‌ చూస్తున్నారు. ‘నాంది’, ‘ఉప్పెన’ ఆడాయి. ఇటువంటి సినిమాలకు ఫ్యాన్స్‌ ఉన్నారు.

మ్యారేజ్‌ తర్వాత ఫస్ట్‌ మూవీ! అదీ కంటెంట్‌ ఓరియెంటెడ్‌ మూవీ. ప్లాన్‌ చేసుకుని చేశారా?
– ఏం ప్లాన్‌ లేదు. పెళ్లికి ముందే సినిమా ఒప్పుకొన్నా. లాక్‌డౌన్‌ వల్ల సినిమా డిలే అయ్యింది. అటువంటి ప్లానింగ్‌ ఏమీ లేదు.

పెళ్లి తర్వాత విడుదలవుతున్న సినిమా ఇదే. మీరెంత ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. వైఫ్‌ ఎంత ఎగ్జైటెడ్‌గా ఉన్నారు?
– నాకు ఎగ్జైట్‌మెంట్‌ ఏమీ లేదు. సినిమా ఆడితే లక్‌ అంటారు. ఆడకపోతే ఆమె బ్యాడ్‌లక్‌ అంటారు. అందుకని, తనకు కొంచెం టెన్షన్‌ ఉంది.

సినిమా టీజర్‌, ట్రైలర్‌ చూసి మీ వైఫ్‌ ఏమన్నారు?
– తనకు బాగా నచ్చింది.

ఆవిడతో సినిమాల గురించి షేర్‌ చేసుకుంటారా?
– లేదు. సినిమాల గురించి మాట్లాడను. మా మధ్య సినిమా, స్టోరీ డిస్కషన్లు ఉండవు. అది వేరే జీవితం, ఇది వేరే జీవితం!

మ్యారీడ్‌ లైఫ్‌ ఎలా ఉంది?
– సేమ్‌! నాకు పెద్ద తేడా ఏమీ లేదు. పెళ్లికి ముందు షాలిని ఇంటికి వచ్చి వెళ్తుండేది. పెళ్లి తర్వాత ఎప్పట్నుంచో తను ఇంట్లో ఉన్న ఫీలింగ్‌. ఇంట్లో మెంబర్‌లా ఉంది తప్ప నాకు కొత్తగా ఏమీ లేదు.

వాళ్ళది డాక్టర్స్‌ ఫ్యామిలీ, మీది యాక్టర్స్‌ ఫ్యామిలీ…
– యాక్టర్‌ అండ్‌ డాక్టర్‌… బాగా సింక్‌ అయ్యింది. నాకు ఏదైనా అనారోగ్యం వస్తే, ఇంతకు ముందు డాక్టర్‌ దగ్గరకు వెళ్ళేవాడ్ని. ఇప్పుడు అత్తమామలకు ఫోన్‌ చేసి అడగొచ్చు.

మల్టీస్టారర్‌ ఫిల్మ్స్‌ చేసే ఇంట్రెస్ట్‌ ఉందా?
– ఉంది. అవకాశం వస్తే… నా ఫస్ట్‌ ఛాయిస్‌ పవన్‌కల్యాణ్‌గారే. ఆ ఛాన్స్‌ ఎప్పుడు వస్తుందా? అని వెయిట్‌ చేస్తున్నా.

మీ ప్రతి సినిమాలో పవన్‌ కల్యాణ్‌గారి ప్రస్తావన ఉంటుంది. మరి, ఈ సినిమాలో?
– ఇందులో ఆ స్కోప్‌ లేదు. జైలులో పవన్‌గారి ఫొటో పెడితే బాగోదు.

మీ నెక్ట్స్‌ సినిమాలు?
– ‘రంగ్‌ దే’ చిత్రీకరణ పూర్తి చేశా. ‘అంధాధున్‌’ రీమేక్‌ షూటింగ్‌ సగం అయ్యింది. ఈ రెండు సినిమాల రిలీజ్‌ డేట్స్‌ అనౌన్స్‌ చేశాం. మేలో ‘పవర్‌ పేట’ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తా. కుదిరితే ఆ సినిమా డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. మరో సినిమాలు యాక్సెప్ట్‌ చేశా. ప్రజెంట్‌ ఉన్నవి రిలీజ్‌ అయ్యాక వాటి గురించి చెబుతా.

20వేల ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టీకా.. త్వరలో ధరల నిర్ణయం, నామినల్ ఫీజే!

0



ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా కొనసాగిస్తున్న భారత ప్రభుత్వం.. తదుపరి విడత వ్యాక్సిన్ పంపిణీకి 20,000 ప్రైవేట్ హాస్పిటళ్లను ఎంపిక చేసింది. 10 వేల ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ఈ ప్రైవేట్ కేంద్రాల్లో కరోనా టీకా అందివ్వనున్నట్లు తెలిపింది. ఈ ప్రైవేట్ వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకా వేయించుకోదలచిన వారు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ బుధవారం (ఫిబ్రవరి 24) తెలిపారు.

మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా మలి విడత వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని మంత్రి ప్రకాశ్ జావదేకర్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేయనుండగా.. ప్రైవేట్ కేంద్రాల్లో కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అయితే.. టీకా కోసం చెల్లించాల్సిన ధరను 3, 4 రోజుల్లో నిర్ణయిస్తామని.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ ధరను వెల్లడిస్తుందని ఆయన తెలిపారు.

ఆ ఖర్చుల వరకే ఫీజు..
ప్రైవేట్ కేంద్రాల్లో వ్యాక్సిన్‌కు నామినల్ ఫీజులే ఉంటాయని ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు. ‘ప్రేవేట్ కేంద్రాల్లో వినియోగమయ్యే కనీస అవసరాల నిమిత్తమే ఈ ఛార్జీలు ఉంటాయి. సిరంజీ ఖర్చులు, వ్యాక్సిన్ వేయడానికి అవసరమైన మానవ వనరుల నిమిత్తం సాధారణ మొత్తం ధరగా నిర్ణయిస్తారు. కరోనా పరీక్షల కోసం ఫీజులు నిర్ణయించిన తరహాలోనే టీకా ధర ఉంటుంది. అటు ప్రైవేట్ రంగం నష్టపోకూడదు.. ఇటు దుర్వినియోగం కాకూడదు. ఈ రెండింటినీ సమతౌల్యం చేసేవిధంగా కేంద్ర నిర్ణయం తీసుకుంటుంది’ అని ఆయన చెప్పారు.

మలి విడత వ్యాక్సినేషన్‌లో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ టీకాలు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ కేంద్రాల్లో వీరందరికీ టీకాను ఫ్రీగా అందించనున్నట్లు వెల్లడించింది.

భారత్‌లో పంపిణీ కార్యక్రమం వేగంగా జరుగుతోంది. బుధవారం ఉదయం 8 గంటల వరకు 1,21,65,598 మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.

Shyam Singha Roy First Look: ‘శ్యామ్ సింగ రాయ్’ ఫస్ట్ లుక్: బ్రిటిష్ ఇండియాలో నాని.. వింటేజ్ లుక్ అదిరింది! – nani shyam singha roy first look released

0


ప్రధానాంశాలు:

  • రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం
  • నాని సరసన ముగ్గురు హీరోయిన్లు
  • నాని బర్త్‌డే సందర్భంగా ‘శ్యామ్ సింగ రాయ్’ ఫస్ట్ లుక్ విడుదల

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా రూపొందుతోన్న వైవిధ్యమైన చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాని సరసన సాయిప‌ల్లవి, కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచీ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో దీనిపై మంచి క్రేజ్ ఏర్పడింది. దీనికి కారణం సినిమా టైటిల్. ‘శ్యామ్ సింగ రాయ్’ అనే వినూత్నమైన టైటిల్ పెట్టడం.. టైటిల్ పోస్టర్ కూడా వైవిధ్యంగా ఉండటంతో అందరి దృష్టి దీనిపై పడింది. నాని ఇప్పటి వరకు చేయని అత్యంత ఆసక్తికర, వైవిధ్యమైన పాత్రను ఈ సినిమాలో చేయబోతున్నారని ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించింది. ఆ మాటలను నిజం చేస్తూ సరికొత్త మేకోవర్‌లో నాని దర్శనమిచ్చారు.

Shyam Singha Roy First Look

‘శ్యామ్ సింగ రాయ్’ ఫస్ట్ లుక్

నేడు (ఫిబ్రవరి 24న) నాని పుట్టినరోజు సందర్భంగా ‘శ్యామ్ సింగ రాయ్’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నాని లుక్ చాలా కొత్తగా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా ద్వారా ప్రేక్షకులను బ్రిటిష్ ఇండియా కాలానికి తీసుకెళ్లబోతున్నారని అర్థమవుతోంది. బ్రిటిష్ ఇండియా టైమ్‌లో భారతీయులు ఎలా ఉండేవారో నాని అచ్చం అలానే ఉన్నారు. అంతేకాకుండా, నానీని అమ్మాయి చేతులు వెనుక నుంచి చుట్టేశాయి. ఆ అమ్మాయి సాయిపల్లవిలా అనిపిస్తోంది. అలాగే, వీళ్ల వెనుక ‘రాయల్ ప్రెస్, కలకత్తా, ఇండియా’ అని రాసుంది.

మొత్తం ఒక్క పోస్టర్‌తో నాని మళ్లీ అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నారు. ఈ పోస్టర్‌ను ట్వీట్ చేసిన నాని.. ‘‘పేరు శ్యామ్.. పూర్తి పేరు’’ అని రాసి వదిలేశారు. అంటే పూర్తి పేరు శ్యామ్ సింగ రాయ్ అని అనుకుంటా. ఈ పోస్టర్‌కు ఫ్యాన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. పోస్టర్ అదిరిపోయిందని కొనియాడుతున్నారు. కాగా, ప్రస్తుతం ‘శ్యామ్ సింగ రాయ్’ టీమ్ కోల్‌కతాలోనే ఉంది. అక్కడ సుధీర్ఘ షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో హీరోహీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటోంది.

నా ఫేవరేట్ ప్లేస్ ఇదే.. రోజూ రెండు మూడు గంటలు ఇక్కడే గడుపుతా: అనసూయ
ఈ సినిమాలో రాహుల్ ర‌వీంద్రన్‌, ముర‌ళీ శ‌ర్మ, అభిన‌వ్‌ గోమ‌టం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ తొలి చిత్రానికి స‌త్యదేవ్ జంగా క‌థ‌ను స‌మ‌కూర్చగా, మెలోడీ సాంగ్స్ స్పెష‌లిస్ట్ మిక్కీ జె. మేయ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. స‌ను జాన్ వ‌ర్ఘీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.