ప్రధానాంశాలు:
- పవన్ తేజ్ హీరోగా వస్తోన్న ‘ఈ కథలో పాత్రలు కల్పితం’
- అభిరామ్ ఎం దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం
- ఈ సినిమాలో పాటను విడుదల చేస్తున్న వైఎస్ షర్మిల
‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమా నుంచి విడుదలవుతోన్న రెండో పాట ఇది. కార్తీక్ కొడగండ్ల స్వరపరిచిన ఈ పాటను దీపు జాను, నూతన మోహన్ ఆలపించారు. శ్రేష్ఠ సాహిత్యం అందించారు. ఈ సినిమా ద్వారా కొణిదెల ఫ్యామిలీకి చెందిన పవన్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఈ పవన్ తేజ్ దగ్గర బంధువు. ఇప్పుడు ఈ సినిమాలోని పాటను వైఎస్ షర్మిల విడుదల చేయబోతున్నారని ప్రకటించడంతో చాలా మంది కళ్లు ఈ సినిమాపై పడ్డాయి. షర్మిల ఇమేజ్ ఈ సినిమా ప్రచారానికి బాగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.
ఈ సినిమాను మాధవి సమర్పణలో ఎంటీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజేష్ నాయుడు నిర్మిస్తున్నారు. అభిరామ్ ఎం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్లో మేఘన, లక్కి హీరోయిన్స్. సునీల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. తాజుద్దీన్ సయ్యద్ మాటలు రాశారు. కార్తీక్ కొడకొండ్ల సంగీతం సమకూర్చారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

‘ఈ కథలో పాత్రలు కల్పితం’ పోస్టర్