ప్రధానాంశాలు:
- ‘ఏమిటో ఏమిటో’ పాటను విడుదల చేసిన వైఎస్ షర్మిల
- హీరోగా పరిచయం అవుతోన్న పవన్ తేజ్ కొణిదెల
- విడుదలకు సిద్ధమవుతోన్న ‘ఈ కథలో పాత్రలు కల్పితం’
పొలిటికల్ సర్కిల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోన్న వైఎస్ షర్మిల చేతుల మీదుగా ఫిబ్రవరి 12న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఈ పాటను విడుదల చేశారు. సాంగ్ విడుదల అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ‘‘సాంగ్ చాలా బాగుంది. చిత్రం కూడా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు’’ అని అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమైన ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలోకి రానుంది.

పాటను లాంచ్ చేసి వీక్షిస్తోన్న వైఎస్ షర్మిల
సాంగ్ విడుదల సందర్భంగా నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ.. ‘‘మా చిత్రంలోని సెకండ్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేసిన వైఎస్ షర్మిల గారికి చిత్ర యూనిట్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిత్రం చాలా బాగా వచ్చింది. ఆడియెన్స్ థ్రిల్ ఫీలయ్యే విధంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో, ఎంటర్టైన్మెంట్ జోడించి దర్శకుడు అభిరామ్ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ చిత్రాన్ని రూపొందించారు. హీరో పవన్ తేజ్ కొణిదెల లాంచింగ్ ఫిల్మ్‌తోనే అందరినీ ఆకట్టుకుంటాడు. నటీనటులందరూ ఈ చిత్రం కోసం ఎంతగానో తోడ్పడ్డారు. వారందరికీ ధన్యవాదాలు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని తెలిపారు.
డైరెక్టర్ అభిరామ్ ఎమ్ మాట్లాడుతూ.. ‘‘అందరి సహకారంతో ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా నిర్మాత రాజేష్ నాయుడు గారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు. ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే హీరోగా పరిచయం అవుతున్న పవన్ తేజ్ కొణిదెలకు ఇది పర్ఫెక్ట్ లాంచింగ్ ఫిల్మ్ అవుతుంది. ఈ సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటాడు. తాజుద్దీన్ సయ్యద్ డైలాగ్స్, సునీల్ కుమార్ సినిమాటోగ్రఫీ, కార్తీక్ కొడకండ్ల సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. సినిమా సెకండ్ లిరికల్ సాంగ్‌ను ఆవిష్కరించి, మా యూనిట్‌కి అభినందనలు తెలిపిన వైఎస్ షర్మిల గారికి ధన్యవాదాలు’’ అని అన్నారు.

‘ఏమిటో ఏమిటో’ సాంగ్.. కొణిదెల హీరో మెలొడి అదిరింది