wife try to kiss husband: వర్క్ ఫ్రమ్ హోమ్.. వీడియోకాల్‌లో ఉన్న భర్తకు ముద్దు పెట్టబోయిన భార్య – wife tries to kiss her husband at zoom video call goes viral

0
29


కరోనా లాక్ డౌన్‌తో ఆఫీసులన్నీ దాదాపు మూతపడ్డాయి. ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా నడుస్తూనే ఉంది. దాదాపు కార్పొరేట్ కంపెనీలన్నీ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్‌నే కొనసాగిస్తున్నాయి. కొందరు సొంతూళ్లకు వెళ్లి హ్యాపీగా ఇంటి నుంచే పని చేసుకుంటున్నారు. అయితే నిత్యం మీటింగులతో మాత్రం బిజీగానే ఉంటారు. వీడియో కాల్స్,జూమ్ మీటింగ్స్ నడుస్తూనే ఉన్నాయి. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు కాని.. మీటింగ్స్ నడుస్తున్నప్పుడు మాత్రం ఉద్యోగులకు చిన్న చిన్న తిప్పలు తప్పడం లేదు. ఎన్నో సరదా సన్నివేశాలు కూడా ఇలాంటి సందర్భాల్లో చోటు చేసుకుంటున్నాయి.

కొందరి ఇళ్లలో పిల్లల ఏడుపులు, అరుపులు కూడా అప్పుడప్పుడు జూమ్ మీటింగ్స్‌లో వినిపిస్తున్నాయి. అలాగే కొన్ని కొన్ని చిలిపి సీన్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి జూమ్ కాల్ మీటింగ్‌లో ఉండగా ఆ విషయం గమనించిన అతని భార్య ముద్దు పెట్టేందుకు ముందుకు వచ్చింది. వెంటనే అతడు అలర్ట్ అయి వెనక్కి వెళ్లడంతో ఆమె వెనక్కి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమెను భర్త కెెమెరా ఆన్‌లో ఉందని వారించాడు. ఇదంతా రికార్డ్ కావడంతో ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఈ వీడియోను ట్వీట్ చేశారు. ‘జూమ్ కాల్ సో ఫన్నీ’ అంటూ ఆయన కామెంట్ చేశారు.

అటు మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా కూడా హర్షా గొయాంక ట్వీట్ పై స్పందించారు. ఈ లేడీని వైఫ్ ఆఫ్‌ ది ఇయర్‌గా నామినేట్ చేస్తానని, ఒకవేళ ఆ భర్త సంతోషించి ఉంటే కపుల్ ఆఫ్ ది ఇయర్‌గా నామినేట్ చేసేవాడినని ఆనంద్ మహీంద్రా అన్నారు. మరోవైపు నెటిజన్స్ మాత్రం ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. భారతీయలు తమ పర్సనల్ లైఫ్‌ను నాలుగు గోడల మధ్య ఉంచుతారు కాబట్టే ఇక్కడ వివాహబంధాలు ఏళ్లు గడిచినా ధృడంగా ఉంటయాని కామెంట్ చేశారు. మరికొందరు ముద్దు పెట్టినందుకు ప్రయత్నించిన అతని భార్య వైవాహిక జీవితంలో ఎంతో ఆనందంగా ఉందని తెలుస్తుందన్నారు. అయితే కొందరు ఇలాంటి వీడియోలు పబ్లిక్‌లో పెట్టకూడదంటూ కూడా పోస్టులు పెట్టారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here