ప్రధానాంశాలు:
- సంప్రదాయాన్ని తిరగరాసిన 12 మంది మహిళలు.
- కొడుకులే అంత్యక్రియలు నిర్వహించాలనే అపోహలు పటాపంచలు
- మరణించిన తండ్రి చివరి కోర్కె తీర్చిన కుమార్తెలు.
సెప్టెంబరు 14, 1930లో జన్మించిన గణపతిరావు.. గతంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. వృద్ధాప్యం కారణంగా ఆయనకు అనారోగ్య సమస్యలు వెంటాడంతో గత కొద్ది రోజులుగా మంచానికే పరిమితమయ్యారు. ఆయన ఆరోగ్యం విషమించి గురువారం సాయంత్రం తుదిశ్వాస విడించారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలకు ఊరు ఊరంతా హాజరయ్యింది. ఆయన 12 మంది కుమార్తెలు తండ్రి పాడె మోసి శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన చితికి అందరూ కలిసి నిప్పంటించారు.
అంత్యక్రియలు పూర్తయిన తర్వాత గణపతిరావు కుమార్తెలు మాట్లాడుతూ.. తాము దహన సంస్కారాలు నిర్వహించి, తమ తండ్రి చివరి కోర్కెను నెరవేర్చామని తెలిపారు. భాగ్యశ్రీ అనే కుమార్తె మాట్లాడుతూ.. తాము 12మంది అక్కాచెల్లెళ్లమని, తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి, తాము కుమారులకేమీ తక్కువకాదని నిరూపించామని వ్యాఖ్యానించారు. గణపతిరావుకు కుమార్తెలు అంత్యక్రియలు నిర్వహించి ఆయన రుణం తీర్చుకున్నారని, కొడుకులే కాదు కూతుళ్లు కూడా కర్మకాండలను చేయలగరని నిరూపించారని గ్రామస్థులు అంటున్నారు. వారి చేసిన పనిని మెచ్చకుంటున్నారు.
బీడ్ జిల్లాల్లో కొద్ది రోజుల కిందట ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. తమ అత్తకు కోడళ్లు అంత్యక్రియలు నిర్వహించారు. నలుగురు కోడళ్లూ కర్మకాండలు చేశారు. సుందర్బాయ్ నాయిక్వాడే (80) అనే మహిళ అనారోగ్యంతో చనిపోయింది. ఆమెకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా.. తమను తల్లిలా చూసుకున్న అత్తకు కోడళ్లు అంత్యక్రియలు నిర్వహించి తమ ప్రేమను చాటుకున్నారు.