ప్రధానాంశాలు:
- విశ్వక్ సేన్ హీరోగా ‘పాగల్’
- వైల్డ్ లవర్‌గా హీరో కొత్త కోణం
- టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచిన చిత్రయూనిట్
గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం 7 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్లో విశ్వక్ సేన్ కాస్త కొత్తగా దర్శనమిచ్చాడు. ‘రేయ్.. ఎవడ్రా.. నా లవర్ని ఏడిపించింది’ అంటూ రూటు మార్చేసి లవర్ బాయ్‌గా తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. ప్రేమ కోసం పరితపించే యువకుడిగా ఆకట్టుకున్నాడు. స్టైలిష్ యాటిట్యూడ్‌తో విశ్వక్ కనబర్చిన హావభావాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి.
నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ‘పాగల్’ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ రాధన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేశారు. ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమాను భారీ రేంజ్లో ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్.
పాగల్ టీజర్