Vishal Chakra: ఆ విషయంలో నేను చాలా గర్వంగా ఫీలవుతాను.. నా కళ్లు చెమ్మగిల్లుతాయి: విశాల్ – chakra is not remake of abhimanyu, says vishal

0
62


యాక్షన్ హీరో విశాల్, డైరెక్టర్ ఎంఎస్‌ ఆనందన్‌ కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘విశాల్ చ‌క్ర’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్రలో రెజీనా క‌సాండ్ర న‌టించారు. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. విశాల్, యువ‌న్ శంక‌ర్‌ రాజా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న 10వ చిత్రం ఇది. ఈ సినిమా ఫిబ్రవ‌రి 19న ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంగా హీరో, నిర్మాత విశాల్ మీడియాతో ముచ్చటించారు.

రెండు భాష‌ల్లోనూ ఇత‌ను మా హీరో అని అభిమానులు అనుకునే అవ‌కాశం కొద్ది మందికే ద‌క్కుతుంది. ఆ అవ‌కాశం మీకు ద‌క్కడం ఎలా అనిపిస్తోంది?
ఆ విష‌యంలో నేను చాలా గ‌ర్వంగా ఫీల‌వుతుంటాను. కొన్ని సార్లు ఆనందంతో నా క‌ళ్లు చెమ్మగిల్లుతాయి. 2004లో నా మొద‌టి సినిమా విడుద‌లైంది. ఈ 17 సంవ‌త్సరాలుగా నాకు అండ‌గా ఉన్న తెలుగు ప్రేక్షకులకు నా హృద‌య‌పూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల‌, క‌న్నడ భాషల‌తో పాటు హిందీలోనూ విడుద‌ల‌వ్వడం హ్యాపీగా ఉంది.

టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏంటి?
యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం అందజేసే ఉన్నత పుర‌స్కారం అశోక చ‌క్ర ఈ సినిమాలో హీరో తండ్రికి వ‌స్తుంది. అయితే కొంత మంది దుండ‌గులు దాన్ని దొంగిలించ‌డంతో ఈ సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. ఇండియ‌న్ ఆర్మీలో ప‌నిచేసే ఒక సైనికుడు దాన్ని ఎలా చేధించాడు అనే విష‌యం మీద సినిమా ఉంటుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. ఈ సినిమాలో ఆఖరి 9 నిమిషాలు ఒక థ్రిల్లింగ్ సీక్వెన్స్ ఉంటుంది. అది చాలా బాగా వ‌చ్చింది. డెఫినెట్‌గా ఆడియ‌న్స్‌కి క‌నెక్ట్ అవుతుంది.

మీరు ఓటును విజయవంతంగా వేశారుధన్యవాదాలు..

ట్రైల‌ర్‌లో విజువ‌ల్స్ చూస్తుంటే ‘అభిమ‌న్యుడు’ సినిమాకి సీక్వెల్ అనిపిస్తోంది. దీని గురించి ఏం చెప్తారు?
లేదండీ! న‌న్ను కూడా చాలా మంది అడుగుతున్నారు. ఈ సినిమా విజువ‌ల్స్ చూస్తుంటే ‘అభిమ‌న్యుడు’ సినిమాలాగా అనిపిస్తుంది అంటున్నారు. కానీ ‘అభిమ‌‌న్యుడు’ సినిమాకి, ఈ సినిమాకి మూడు సిమిలారిటీస్ మాత్రమే ఉన్నాయి. ఒక‌టి.. ఇది కూడా సైబ‌ర్ క్రైమ్ థ్రిల్లర్‌, రెండోది ఈ స‌మాజంలో జరుగుతున్న విష‌యాలు డైరెక్ట్‌గా స్క్రీన్ మీద చూపించ‌డం, మూడోది ఈ సినిమాలో కూడా నేను మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌గా న‌టించ‌డం. ఈ మూడు త‌ప్ప మిగ‌తా స్క్రిప్ట్ అంతా చాలా కొత్తగా ఉంటుంది.

ఈ క‌థ‌లో మీకు కొత్తగా అనిపించిన అంశాలేంటి?
మ‌నం ఏదైనా ప్రదేశానికి వెళ్లాలని గూగుల్‌లో సెర్చ్ చేస్తే మరుక్షణ‌మే దానికి సంభందించిన సమాచారం టెక్ట్స్ మెసేజ్ రూపంలో మ‌న‌కి వ‌స్తుంది. అలాగే మ‌న సోష‌ల్ మీడియా అకౌంట్స్‌లో ఆ ప్రదేశానికి సంబంధించిన బెస్ట్ డీల్స్‌, బెస్ట్ హోట‌ల్స్ అని యాడ్ రావ‌డం మీరు గ‌మ‌నించే ఉంటారు. అంటే మ‌నకి ఏం కావాలి?, మ‌నం ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నాం అనే విష‌యాల‌పై మ‌రొక‌రి నిగా ఉంది అని అర్థం. వాటితో పాటు మీకు లాట‌రి వ‌చ్చింది మీ అకౌంట్స్ డీటైల్స్ ఇవ్వండి డబ్బులు పంపిస్తాం అని మ‌న‌కు మెయిల్స్ వ‌స్తుంటాయి. అలా పంపిస్తే మ‌న అకౌంట్ ఖాళీ అవుతుంది. ప్రస్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న ఇలాంటి సైబ‌ర్ నేరాల‌ పట్ల మ‌నం ఎంత అప్రమ‌త్తంగా ఉండాలో తెలియ‌జెప్పే చిత్రమిది.

RRR మరో సెన్సేషన్: తమిళనాడు థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న లైకా.. భారీ ధర!
ఈ సినిమా కోసం ఎలాంటి రీసెర్చ్ చేశారు?
ఇలాంటి సున్నిత‌మైన అంశాల‌ మీద సినిమా చేస్తున్నప్పుడు క‌చ్చితంగా స‌మాజంలో జ‌రిగిన, జ‌రుగుతున్న విష‌యాల గురించి మాత్రమే చెప్పాలి. ఒక‌వేల మ‌నం ఊహించి చెబితే దాని వ‌ల్ల సామాన్య ప్రజ‌లు ఇంకా ఎక్కువ భ‌య‌ప‌డే అవ‌కాశం ఉంటుంది. ఈ క‌థ నాకు చెప్పడానికి ముందే ద‌ర్శకుడు ఆనంద‌న్ పూర్తి రీసెర్చ్ చేశాడు. ఈ క‌‌థ చెబుతున్నప్పుడు నాకు రెండు స‌న్నివేశాల్లో విజిల్ కొట్టాలి అనిపించింది. అంత బాగా క‌థ‌ రాసుకున్నాడు ద‌ర్శకుడు ఆనంద‌న్‌.

ద‌ర్శకుడు ఆనంద‌న్ ఫ‌స్ట్ మూవీ క‌దా! అత‌ని మేకింగ్ స్టైల్ గురించి చెప్పండి.
మాములుగా ఒక క‌థ విన‌గానే దాని గురించి ఆలోచించుకోవ‌డానికి కొంత టైమ్ కావాలి అని రెండు మూడు రోజుల్లో ఒకే చేస్తాం. కానీ, ఆనంద‌న్ ఈ క‌థ చెప్పగానే ఒక కొత్త డైరెక్టర్ అని ఆలోచించ‌కుండా వెంట‌నే ఒకే చెప్పాను. నాకు క‌థ అంత బాగా నచ్చింది. ఆనంద‌న్ ఫ‌స్ట్ సినిమాకే త‌న బెస్ట్ ఇచ్చాడు. మేకింగ్ ప‌రంగా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. మా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌లో మ‌రో టాలెంటెడ్ డైరెక్టర్‌ని ప‌రిచ‌యం చేయ‌డం హ్యాపీగా ఉంది.

చరిత్ర సృష్టించిన ‘ఉప్పెన’.. 21 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన వైష్ణవ్ తేజ్ సినిమా
యువ‌న్ శంక‌ర్‌ రాజాతో ఇది10వ సినిమా క‌దా.. మీ ఫీలింగ్ ఏంటి?
యువ‌న్ శంక‌ర్ రాజా నా బెస్ట్ ఫ్రెండ్‌. నేను అత‌న్ని సొంత తమ్ముడిలా ఫీల‌వుతాను. మా ఇద్దరి కాంబినేష‌న్ త‌ప్పకుండా ఒక మ్యాజిక్ చేస్తుంద‌ని నేను న‌మ్ముతాను. అందుకే అత‌నితో ఫైట్ చేసైనా స‌రే నా మూవీస్‌కి వ‌ర్క్ చేయించుకుంటాను. ఈ సినిమాకి యువ‌న్ కావాల‌ని ఎందుకు కోరుకున్నాను అంటే.. ఒక కొత్త డైరెక్టర్‌కి మంచి టెక్నీషియ‌న్ బ్యాక‌ప్ ఉంటే త‌ను అనుకున్న దాని క‌న్నా సినిమా ఇంకా బాగా తీయ‌గ‌ల‌డు. యువ‌న్ ఈ సినిమాకి మంచి మ్యూజిక్‌తో పాటు అదిరిపోయే ఆర్‌ఆర్ కూడా ఇచ్చాడు. రేపు థియేట‌ర్‌ల‌లో ఆడియ‌న్స్ కూడా ఇదే ఫీల‌వుతారు. నా త‌దుప‌రి రెండు చిత్రాల‌కు కూడా అత‌నే మ్యూజిక్ డైరెక్టర్‌.

మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి.
నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్యతో క‌లిసి ‘ఎనిమీ’ అనే సినిమా చేస్తున్నాను. ఆ సినిమాలో వాడే నా ‘ఎనిమీ’. అలాగే నా డైరెక్షన్‌లో ‘అభిమ‌న్యుడు-2’ చేస్తున్నాను. త్వర‌లో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఆ త‌ర్వాత శ‌ర‌వ‌ణ‌న్ అని ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్ మంచి క‌థ చెప్పాడు. ఆ సినిమా కూడా వ‌న్ ఆఫ్ మై కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంద‌ని న‌మ్మకం ఉంది. ఇవే కాకుండా వ‌చ్చే ఏడాది ఉగాదికి ఒక స్ట్రయిట్ తెలుగు మూవీ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాను. ఆ సినిమా ప్రీ ప్రొడ‌క్షన్ ప్రస్తుతం జ‌రుగుతోంది. వీటితో పాటు మ‌రికొన్ని క‌థ‌లు విన్నాను. త్వర‌లోనే వాటి గురించి వివ‌రిస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here