village volunteer attacked: ప.గో: వివాహితతో అక్రమ సంబంధం.. గ్రామ వాలంటీర్‌ను నరికేసిన భర్త – villaga valunteer was attacked in west godavari district over illegal affair

0
31


గ్రామ వాలంటీర్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం పొనుకుమాడులో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం… పొనుకుమాడుకు చెందిన గాలంకి శివకృష్ణ ప్రగడవరం గ్రామ సచివాలయంలో వాలంటీరుగా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం అదే గ్రామానికి చెందిన మువ్వా మోహన్‌రావు కత్తితో శివకృష్ణపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తలపై నరకడంతో తీవ్రంగా గాయపడిన శివకృష్ణను స్థానికులు చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Also Read: వికారాబాద్‌: కరాటే కలిపిన బంధం.. ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య

ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. గతంలో మోహన్‌రావు కుటుంబసభ్యులు కరోనా బారిన పడినట్లు శివకృష్ణ అధికారులకు చెప్పడంతో అప్పట్లో వారిని ఏలూరు క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారని, దీనికి తోడు తన భార్యతో శివకృష్ణ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలియడంతో మోహన్‌రావు కక్ష పెంచుకునే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here