ప్రధానాంశాలు:
- నితిన్ ప్రసన్న హీరోగా థ్రిల్లర్ మూవీ A
- ట్రైలర్ రిలీజ్ చేసిన విజయ్ సేతుపతి
- మెడికల్ మాఫియాను లింకు చేస్తూ సరికొత్త ప్రయోగం
కొద్దిసేపటి క్రితం ఈ ట్రైలర్‌ని తమిళ స్టార్ విజయ్ సేతుపతి రిలీజ్ చేశారు. ఈ మేరకు చిత్రయూనిట్ మొత్తానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఒక నిమిషం 44 సెకనుల నిడివితో కట్ చేసిన ‘A’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సస్పెన్స్, థ్రిల్లింగ్, రొమాన్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని తెలుపుతూ శాంపిల్ సన్నివేశాలను చూపించారు. సైన్స్, డిమాండ్స్, సాక్రిఫైజ్ (త్యాగం) అనే మూడు విభిన్న కోణాలను టచ్ చేస్తూ ఈ కథను ఎంతో ఆసక్తికరంగా మలిచామని ట్రైలర్ ద్వారా చెప్పారు మేకర్స్.
ఒకే వ్యక్తి.. ఆ వ్యక్తిని కళల రూపంలో గతం వెంటాడటం, దీనికి మెడికల్ మాఫియా లింకు చేయడం చూస్తుంటే ఈ కథతో ఏదో సరికొత్త ప్రయోగం చేశారని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. కథ అంతా ఓ చిన్నారి చుట్టూ తిరుగుతూ సస్పెన్స్ సన్నివేశాలతో రక్తి కట్టిస్తుందని అర్థమవుతోంది. మొత్తానికైతే ఈ ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారని చెప్పుకోవాలి. మునుపెన్నడూ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమాలో హీరో నితిన్ ప్రసన్న మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. మార్చి 5వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.