ప్రధానాంశాలు:
- యుగంధర్ ముని దర్శకత్వంలో రాబోతున్న థ్రిల్లర్ మూవీ ‘A’
- ఫిబ్రవరి 26న గ్రాండ్‌గా రిలీజ్
- వేగవంతం చేసిన ప్రమోషన్స్
ఈ మేరకు టైటిల్ పోస్టర్, ఫస్ట్‌లుక్, టీజర్ లను ప్రముఖ సెలబ్రిటీల చేతుల మీదుగా రిలీజ్ చేయిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజర్ జగపతిబాబు చేతుల మీదుగా విడుదల చేయగా భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇదేబాటలో ఇప్పుడు ‘A’ ట్రైలర్‌ని మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఫిబ్రవరి 5వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ తాజాగా ఓ పోస్టర్ వదిలారు మేకర్స్.
కొన్ని సమయాల్లో నిజాలు కల్పితాల కంటే చాలా బలంగా ఉంటాయనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకొని ఈ సినిమా రూపొందిస్తున్నారు. మునుపెన్నడూ చూడని విధంగా ఈ మూవీ థ్రిల్ చేయనుందని చిత్రయూనిట్ నమ్మకంగా ఉంది. ఫిబ్రవరి 26న వరల్డ్ వైడ్‌గా అత్యధిక థియేటర్స్‌లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని పీవీఆర్ సంస్థ గ్రాండ్‌గా రిలీజ్ చేయనుంది. విజయ్ కురాకుల సంగీత సారథ్యంలో రూపొందించిన ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికే విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.