ప్రధానాంశాలు:
- తెలుగులో హీరోగా వస్తోన్న బాబీ సింహా
- ‘డిస్కోరాజా’లో విలన్‌గా మెప్పించిన బాబీ
- ‘వసంత కోకిల’తో మూడు భాషల్లో ఒకేసారి
ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. బాబీ డిఫరెంట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఈరోజు రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ‘రేజ్ ఆఫ్ రుద్ర’ పేరిటి వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా రుద్రగా బాబీని పరిచయం చేశారు. థ్రిల్లింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, బాబీ సింహా మ్యాన్లీ లుక్ ఈ వీడియోలో హైలైట్స్. రొమాంటిక్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా రెడీ అవుతుంది.
సినిమా జానర్‌కి, బాబీ సింహా అద్భుత నటనకు తగిన విధంగానే దర్శకుడు రమణన్ ‘వసంత కోకిల’ను తెరకెక్కించారని చిత్ర బృందం కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. జాతీయ అవార్డు గ్రహీత కమల్ హాసన్, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ‘వసంత కోకిల’ ఏ స్థాయి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో మరో జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా నటించడం విశేషం.
థింక్ మ్యూజిక్ సంస్థ ఈ సినిమా ఆడియో హక్కులను దక్కించుకుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల చేస్తామని నిర్మాత రామ్ తళ్లూరి తెలిపారు. రాజేష్ మురుగేశన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి గోపీ అమరనాథ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వివేక్ హర్షన్ ఎడిటర్. చంద్రబోస్ సాహిత్యం అందించారు. తెలుగు మాటలను రాజేష్ ఎ మూర్తి రాశారు.

బాబీ సింహా ‘వసంత కోకిల’ మోషన్ పోస్టర్