ప్రధానాంశాలు:
- నితిన్ హీరోగా రూపొందిన ‘చెక్’
- టాలీవుడ్‌కు పరిచయమవుతోన్న వింక్ బ్యూటీ ప్రియా వారియర్
- లాయర్‌గా కీలక పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్
ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే దర్శకులు వెంకీ కుడుముల, గోపీచంద్ మలినేని అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ హీరో నితిన్‌పై సరదాగా సెటైర్లు వేశారు. పెళ్లయ్యాక నితిన్ మరింత స్పీడు పెంచాడని అన్నారు.

‘చెక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
‘‘రాజమౌళి గారి గురించి మాట్లాడే అవకాశం ఇప్పటి వరకు నాకు రాలేదు. ఆయనతో తొలిసారి వేదికను పంచుకోవడం నాకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. స్కూల్ డేస్ నుంచి మీ సినిమాలు చూశాను సార్. మీకు నేను పెద్ద అభిమానిని. కలలు పెద్దగా కనాలని మీరు అందరికీ సూచించారు. మీ వల్లే ఇండస్ట్రీలో అందరూ పెద్దగా కలలు కంటున్నారు, గొప్పగా ఆలోచిస్తున్నాను. ఆ క్రెడిట్ అంతా మీకే సార్’’ అని జక్కన్నపై ప్రశంసల వర్షం కురిపించారు వరుణ్.
సాధారణంగా పెళ్లయిన తరవాత ఎవరైనా కాస్త స్లో అవుతారని.. కానీ, నితిన్ స్పీడు పెంచాడని.. నాలుగు సినిమాల డేట్లు కూడా ప్రకటించి అందరికీ చెక్ పెట్టాడని అన్నారు వరుణ్ తేజ్. ‘‘నితిన్.. మరీ టూ మచ్. ట్రాఫిక్ ఎక్కువ చేశావ్’’ అంటూ వరుణ్ జోకులు వేశారు. ఏడాదిన్నర క్రితం తనను కలిసినప్పుడు ‘చెక్’ సినిమా స్టోరీ తనకు నితిన్ చెప్పాడని వరుణ్ అన్నారు. ఈ సినిమాపై నితిన్‌కు ఎంతో నమ్మకం ఉందని.. అది కచ్చితంగా నిజమవుతుందని వరుణ్ ఆకాంక్షించారు. చిత్ర యూనిట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
‘చెక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. నితిన్‌పై వరుణ్ తేజ్ సెటైర్లు