న్యాయ శాఖలోని కొన్ని కీలక పదవుల భర్తీపై బైడెన్ గురువారం ప్రకటనలు చేశారు. ఇదిలా ఉండగా.. వనితా నియామకాన్ని సెనేట్ ధ్రువీకరిస్తే.. ఈ కీలక పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్వేతజాతియేతర తొలి మహిళగా చరిత్ర సృష్టిస్తారు.
‘ఆమె నియమాకాన్ని సెనేట్ ధ్రువీకరిస్తే అసోసియేట్ అటార్నీ జనరల్‌గా పనిచేసిన మొదటి మహిళ వనితా అవుతారు… వనితా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలివేస్తున్నందుకు నేను కృతజ్ఞుడను.. ప్రపంచంలోని ప్రధాన పౌర హక్కుల సంస్థలలో ఒకటైన మన న్యాయ వ్యవస్థను మరింత సమానత్వం, సమర్ధవంతమైందని నిర్ధారించడానికి మరోసారి ఆమె సేవలను వినియోగించుకోబోతున్నాం’ అని బైడెన్ వ్యాఖ్యానించారు.
ఎన్ఏఏసీపీ లీగల్ డిఫెన్స్ ఫండ్‌లో వనితీ కెరీర్ ప్రారంభం కాగా.. ఆ తరవాత అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం బరాక్ ఒబామా హయాంలో న్యాయ శాఖలోని పౌర హక్కుల విభాగానికి నాయకత్వం వహించారు. ఫెర్గూసన్, మిస్సోరి ఇతర వర్గాల పట్ల పోలీసుల హింస, అధికార దుర్వినియోగాలపై దర్యాప్తునకు నాయకత్వం వహించారు.
తన నియామకంపై వనితా గుప్తా స్పందిస్తూ.. ఫెడరల్ ప్రభుత్వంలో న్యాయ శాఖ వంటి విలువైన ఏజెన్సీ మరేదీ లేదని పేర్కొన్నారు. ‘ఉత్తమంగా, ఇది పవిత్రమైన వాగ్దానం. అందరికీ సమాన న్యాయం వాగ్దానం ఎవరూ చట్టానికి అతీతులు కారు.. ఆ వాగ్దానాలు శక్తితో అనుసరించి, మన దేశానికి వెలుగునిచ్చి, ప్రపంచానికి ఒక దారిచూపేలా పనిచేయాలి. కానీ వాటిని వదిలేస్తే మేము మా ప్రజాస్వామ్యాన్ని దిగజార్చి, విభజనను ప్రేరేపించినవారమవుతాం’అని ఆమె అన్నారు.