ప్రధానాంశాలు:
- ‘ఉప్పెన’ విడుదల తేదీ ఖరారు
- పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం
- మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట విపరీతంగా ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టింది. ఈ ఒక్క పాటతో ‘ఉప్పెన’కు బోలెడంత ప్రచారం దక్కింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు వేచిచూస్తున్నారు. మొత్తానికి విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ఫిబ్రవరి 12న ఈ సినిమాని థియేటర్లలోకి రానుంది.
సంగీతంలో తన అభిరుచి, పాటలను ప్రెజెంట్ చేసిన విధానంతో అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకున్న బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలను కూడా అందించారు. సుకుమార్ రైటింగ్స్ సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి తమ స్క్రీన్ ప్రజెన్స్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు. ఈ టీజర్‌తో ‘ఉప్పెన’పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు.