Uppena First Week Collection: వారం రోజుల్లో రూ.70 కోట్లు: ఏంటీ ‘ఉప్పెన’.. మరో అరుదైన రికార్డ్ – vaisshnav tej, krithi shetty uppena collects 70 crores gross in the 1st week worldwide

0
27


ప్రధానాంశాలు:

  • వారం రోజుల్లో రూ.70 కోట్ల గ్రాస్
  • ఒక డెబ్యూ హీరోకి ఇదే అత్యధికం
  • తొలి సినిమాతో రికార్డులు తిరగరాస్తోన్న వైష్ణవ్ తేజ్

బాక్సాఫీసును షేక్ చేసే సినిమాలు టాలీవుడ్‌లో చాలానే వస్తుంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఆ తరవాత బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే, కొత్త హీరోహీరోయిన్లు.. కొత్త దర్శకుడితో రూపొందిన ఒక సినిమా బాక్సాఫీసు వద్ద కాలసుల వర్షం కురిపించడంతో పాటు రికార్డులు బద్దలుకొట్టడం చాలా అరుదు. అలాంటి అరుదైన చిత్రమే ‘ఉప్పెన’.

కరోనా భయంతో ఎనిమిది నెలలపాటు ఇళ్లకే పరిమితమైన జనాలు థియేటర్లకు సినిమా చూడటానికి వస్తారా అని చాలా మంది అనుమానపడ్డారు. కానీ, ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ థియేటర్లకు ఎగబడుతున్నారు మన తెలుగు ప్రేక్షకులు. సినిమా బాగుండాలి కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా థియేటర్‌కు వెళ్లి చూస్తామని నిరూపిస్తున్నారు. అందుకే కలెక్షన్లు ‘ఉప్పెన’లా వచ్చి పడుతున్నాయి.

Chiranjeevi: ‘ఆచార్య’లో మరో స్టైలిష్ విలన్.. చిరంజీవిని ఢీకొడుతున్న బెంగాలీ నటుడు!!
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా.. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమైన ‘ఉప్పెన’ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు. అందుకే, కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఒక కొత్త హీరో, హీరోయిన్, దర్శకుడికి ఇదో అరుదైన రికార్డ్. కేవలం టాలీవుడ్‌లోనే కాదు.. భారత సినీ చరిత్రలోనే ఇంతకు ముందెన్నడూ కొత్తవాళ్ల సినిమా ఈ స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేదు.

నిజానికి ఈ సినిమా మూడు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన సొమ్ము మొత్తాన్ని వసూలు చేసేసి లాభాల్లోకి వెళ్లిపోయింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.22.5 కోట్లకు అమ్ముడుపోగా.. వారం రోజుల్లో సుమారు రూ.45 కోట్ల షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా ‘ఉప్పెన’ నిలిచింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో మరపురాని చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమా రూ.100 కోట్లు వసూలు చేస్తుందని దర్శకుడు బుచ్చిబాబు గురువు, ప్రముఖ దర్శకుడు సుకుమార్ గతంలో అన్నారు. ఆయన మాటలు నిజం చేస్తూ ‘ఉప్పెన’ రూ.100 కోట్ల వైపు దూసుకెళ్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here