ప్రధానాంశాలు:
- రాజమండ్రిలో ‘ఉప్పెన’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్
- జనసంద్రమైన వీఎల్ పురంలోని వేదిక
- మెగా అభిమానులను పదే పదే హెచ్చరించిన శ్యామల
మీరు ఓటును విజయవంతంగా వేశారుధన్యవాదాలు..
Login to View Poll Results
రాజమండ్రిలోని వి.ఎల్.పురంలో ఉన్న మార్గాణి ఎస్టేట్స్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ విజయోత్సవ సభ జనసంద్రమైపోయింది. విశాలమైన మైదానంలో భారీ సెట్ వేసి నిర్వహించినా జనాన్ని కంట్రోల్ చేయడం నిర్వాహకుల వల్ల కాలేదు. శ్రేయాష్ మీడియా కరోనా పరిస్థితుల తరవాత హైదరాబాద్ బయట భారీ ఎత్తున నిర్వహించిన ఈవెంట్ ఇది. ఇలాంటి ఈవెంట్‌కు మెగా అభిమానులు కాస్త ఇబ్బంది కలిగించారు. సౌండ్ సిస్టమ్ ఏర్పాటుచేసిన స్తంభాలు ఎక్కడం, మైక్ వైర్లు లాగేయడం వంటివి చేశారు. దీంతో యాంకర్ శ్యామల పదే పదే మెగా అభిమానులను సున్నితంగా హెచ్చరించారు. దయచేసి అభిమానులు కాస్త ఓపిగ్గా ఉండి ఈవెంట్ జరగనివ్వాలని కోరారు.

అభిమానులపై లాఠీ ఝుళిపిస్తోన్న పోలీసు అధికారి
ఆఖరికి శ్రేయాష్ మీడియా అధినేత శ్రీనివాస్ సైతం వేదికపైకి వచ్చి రిక్వెస్ట్ చేశారు. ఒక గంటలో ఈవెంట్ అయిపోతుందని.. దయచేసి తమకు సహకరించాలని కోరారు. పోలీసులు సహకరించి అభిమానులను కంట్రోల్ చేయాలని వేడుకున్నారు. ఆఖరికి పోలీసులు అభిమానులపై లాఠీ ఝళిపించారు. మొత్తం మీద చిన్న చిన్న ఇబ్బందులతో ‘ఉప్పెన’ బ్లాక్ బస్టర్ ఈవెంట్ కొనసాగింది. ఈ ఈవెంట్లో రామ్ చరణ్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ, వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి, నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ఎంపీ భరత్, తదితరులు పాల్గొన్నారు.