upasana konidela: ‘నాట్యం’ ఫస్ట్‌లుక్: ఉపాసన ఎంకరేజ్ చేస్తున్న ఈ మూవీ వెనుక అసలు కథేంటి..? – upasana konidela released natyam first look

0
24


సినిమాలో కంటెంట్ ఎంత బలంగా ఉంటుందో ఆ సినిమా ప్రమోషన్స్ అంతే బలంగా చేశారంటే ఇక ఆ సినిమాకు తిరుగే ఉండదు. చిత్ర ఆరంభం నుంచే ప్రముఖమైన వ్యక్తులతో ఫస్ట్‌లుక్, టీజర్ లాంచ్ లాంటి కార్యక్రమాలు చేయించడం వల్ల ఆ మూవీకి బెస్ట్ ప్రమోషన్ దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన స్నేహితురాలు, హైదరాబాదీ కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు తొలి సినిమా ‘నాట్యం’ కోసం నడుం బిగించింది ఉపాసన. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది మెగా కోడలు.

నిన్న తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టి ‘నాట్యం’ అని పేర్కొంటూ సస్పెన్స్ క్రియేట్ చేసిన ఉపాసన.. నేడు (జనవరి 23) ఆ నాట్యం సస్పెన్సుకి తెరదించుతూ ‘నాట్యం’ ఫస్ట్‌లుక్ పోస్టర్ అందరితో పంచుకుంది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెడుతూ.. ”తొలిసారి నాట్యం సినిమాతో కెమెరా ముందుస్తున్న నా స్నేహితురాలు సంధ్యా రాజును మీకు పరిచయం చేస్తున్నా. టైటిల్ చాలా నచ్చింది” అని పేర్కొంది ఉపాసన.
అక్కినేని కోడలికి అతనితో అంత చనువా? ఐ లవ్ యూ అనడమేంటి..? దెబ్బకు పోస్ట్ డిలీట్ చేసిన సామ్
ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో సంప్రదాయ చీరకట్టుతో కనిపిస్తున్న సంధ్యా రాజు.. నటరాజు ఎదుట నాట్య భంగిమతో ఇచ్చిన పోజు ఎంతగానో ఆకట్టుకుంటోంది. డాన్సింగ్ నేపథ్యంలో రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటన పరంగా, డాన్స్ పరంగా సంధ్యా రాజు తన టాలెంట్ బయటపెట్టనుందట. ఇకపోతే ఈ చిత్రంలో కమల్ కామరాజు, రోహిత్ బెహల్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హంపి, లేపాక్షి, బెంగుళూరు, హైదరాబాద్ లాంటి తదితర అందమైన లొకేషన్స్‌లో ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు. అతి త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here