up man murder: ప్రాణాలు తీసిన పెగ్గు.. స్నేహితుడి కిరాతకం – man killed by friend for refusing to share liquor in uttar pradesh

0
26


చిన్న చిన్న విషయాలకే కొందరు కోపంతో రగిలిపోతూ దారుణాలకు ఒడిగడుతున్నారు. క్షణికావేశంలో కుటుంబ సభ్యులను, స్నేహితులను అంతమొందించేందుకు కూడా వెనకాడడం లేదు. అలాంటి ఘటన ఒకటి తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మద్యం కోసం స్నేహితుడిని కిరాతకంగా నరికి చంపేశాడో దుర్మార్గుడు. ఐదు రోజుల అనంతరం నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు విచారణలో చెప్పిన విషయం విని షాకయ్యారు.

షామ్లి జిల్లాలోని పీర్ఖేడా ప్రాంతానికి చెందిన జస్‌బీర్(60)ని అతని స్నేహితుడు క్రిష్ణపాల్(55) దారుణంగా చంపేశాడు. నిందితుడి కోసం ఐదు రోజులు గాలించిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి స్టేషన్‌కి తీసుకొచ్చి విచారణ చేపట్టడంతో షాకింగ్ విషయం చెప్పాడు. పెగ్గు పోయమంటే పోయలేదని.. అందుకే నరికేశానని చెప్పడంతో కంగుతిన్నారు. కేవలం పెగ్గు కోసం స్నేహితుడిని హత్య చేయడం షాక్‌కి గురిచేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ప్రియురాలితో నెల్లూరు, తిరుపతి.. చివరికి గుంటూరులో దారుణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here