వీరిలో ఇద్దరు అప్పటికే చనిపోగా.. మరో బాలిక అపస్మారక స్థితిలో ఉంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, విచారణ చేపట్టామని తెలిపారు. నిందితుడు వినయ్‌కు ముగ్గురు బాలికలతో లాక్డౌన్ సమయంలో స్నేహం ఏర్పడింది. రోజూ పొలాల్లో వీరంతా కలుసుకుని సరదగా కాలక్షేపం చేసేవారు. వీరిలో ఓ బాలికను ఇష్టపడిన వినయ్ ఆమెకు తన ప్రేమను తెలియజేశాడు. దీనికి ఆ బాలిక తిరస్కరించింది.
నెల రోజుల కిందట ఫోన్ నెంబరు అడిగినా ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఆ కోపంతో చంపాలని నిర్ణయించుకుని పథకం వేశాడు. ముందుగా అనుకున్న ప్రకారం బుధవారం పొలానికి వచ్చిన బాలికలకు తన స్నేహితుడితో స్నాక్స్ తెప్పించి ఇచ్చాడు. వారు అవి తిని నీళ్లు అడగటంతో అప్పటికే సీసాలో పురుగుమందు కలిపిన నీటిని ఇచ్చాడు. ఆ నీటిని తాగిన తర్వాత పొలంలోనే వారిని విడిచిపెట్టి వెళ్లిపోయాడని పేర్కొన్నారు.
లక్నో రేంజ్ ఐజీ లక్ష్మి సింగ్ మాట్లాడుతూ.. వినయ్ పొలానికి పక్కనే బాధిత బాలికల పొలం కూడా ఉందని తెలిపారు. ప్రేమను అంగీకరించలేదనే అక్కసుతో తన పొలంలో ఉన్న పురుగుల మందును నీటిలో కలిపి వాటిని ముగ్గురితో తాగించడానికి అన్నారు. పోస్ట్‌మార్టమ్‌లో బాధితుల శరీరంపై ఎటువంటి గాయాలు కనిపించకపోవడంతో విష ప్రయోగం జరిగినట్టు తేలిందన్నారు. విషం కలిపిన నీళ్లు తాను ప్రేమించిన అమ్మాయితోనే తాగించాలని పథకం వేశాడని, మిగతా ఇద్దర్నీ తాగొద్దన్నా వారు వినిపించుకోలేదని వినయ్ చెప్పినట్టు పేర్కొన్నారు.