జోసెఫ్‌ను వెంటనే ల్యూసెస్టర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతూ అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మూడు వారాల్లో యూకేలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగింది. దీంతో బ్రిటన్‌లో లాక్డౌన్ విధించారు. ఆ తర్వాత భారత్ సహా చాలా దేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి.
జోసెఫ్ కొద్ది రోజుల కిందటే మెల్లగా కళ్లు తెరిచాడు. ఆ తర్వాత పెదాలు కదిపాడు. తన కళ్లతో భావాలను వ్యక్తపరుస్తున్నాడు. జోసెఫ్ కోలుకున్న విషయం తెలియగానే అతడి తల్లికి మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది. వెంటనే కుమారుడిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దాడాలనుకుంది. కానీ, ఇప్పుడు ఆమెకు ఆ అవకాశం లేదు. బ్రిటన్‌లో ప్రస్తుతం కరోనా వైరస్ కొత్త రకం స్ట్రెయిన్ పంజా విసురుతున్న విషయం తెలిసిందేగా. మళ్లీ లాక్డౌన్లో విధించారు. కఠిన ఆంక్షలు విధించారు. అందువల్ల జోసెఫ్‌ను కలవడానికి డాక్టర్లు అతడి కుటుంబసభ్యులను అనుమతించడంలేదు.
ఆ యువకుడి ఆరోగ్యం బాగా మెరుగైందని వైద్యులు చెబుతున్నారు. ‘మా జోసెఫ్ ఇప్పుడు నర్సులకు హై ఫై కూడా ఇవ్వగలడు..’ అని అతడి ఆంటీ సంతోషంగా చెబుతోంది. కానీ, ఇప్పుడు వాళ్లకు ఒకటే టెన్షన్.. అతడికి భౌతిక దూరం, ఇతర జాగ్రత్తల గురించి ఎలా చెప్పాలి? అంతకంటే ముందు.. అసలు కరోనా వైరస్ గురించి ఎలా చెప్పాలి? ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి? అని.
ఈ పెద్దోళ్ల చాదస్తం గానీ.. అతడు కుర్రోడు కదా, అన్నీ తొందరగానే నేర్చుసుకుంటాడు. అదెలా అంటారా..? అతడికి ఇప్పుడు మరోసారి కరోనా పాజిటివ్‌గా తేలింది మరి. ఎందుకంటారా.. ఈ మధ్యే హాస్పిటల్ వార్డులో నడవడం మొదలుపెట్టాడు. ఆ వైరస్ ఎలా అంటుకుందో, ఏమో మరి..!!