పుణే మున్సిపల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మిస్సయిన వీరంతా ముంబయి విమానాశ్రయంలో దిగి, రోడ్డు మార్గం ద్వారా పుణేకు చేరినట్టు తెలిపారు. వీరిని ఎక్కడున్నారని గుర్తించడానికి అధికార బృందాలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. పీఎంసీ నిబంధనల ప్రకారం.. పశ్చిమ ఆసియా, ఐరోపా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ సొంత ఖర్చులతో తప్పనిసరిగా వ్యవస్థాగత క్వారంటైన్లో ఏడు రోజులు ఉండాలి.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ తొలుత యూకే నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చింది. తర్వాత ఢిల్లీ-విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలులో డిసెంబరు 22న రాజమండ్రి చేరుకుంది. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. దీంతో ఆమె ఎక్కడుందో తెలుసుకోడానికి అధికారులు కష్టపడాల్సి వచ్చింది. ఏలాగోలా ఆమెను గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు.
రాజమండ్రికి డిసెంబరు 24 తెల్లవారుజామున తన కుమారుడితో సహా మహిళ చేరుకుంది. తొలుత కుమారుడు ఆమెను ఢిల్లీ విమానాశ్రయంలో రిసీవ్ చేసుకుని, ఇద్దరూ రైలెక్కారు. దాదాపు 1,800 కిలోమీటర్ల ప్రయాణంలో చాలా మందితో వీరు కాంటాక్ట్ అయి ఉంటారు. తల్లీకుమారులు ఇద్దర్నీ రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో వేర్వేరుగా ఐసోలేషన్ గదుల్లో ఉంచారు.