Tuck Jagadish: నాని బర్త్ డే గిఫ్ట్ ఇదే.. అలా ముస్తాబైన ‘టక్ జగదీష్’ – nani’s tuck jagadish teaser release date announced

0
22


ప్రధానాంశాలు:

  • నాని హీరోగా ‘టక్ జగదీష్’
  • రిపీట్ కాబోతున్న శివ నిర్వాణ- నాని కాంబో
  • పుట్టినరోజు కానుక సిద్ధం చేసిన చిత్రయూనిట్

ఇటీవలే V సినిమాతో థ్రిల్ చేసిన నాచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ అనే మరో వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాని కెరీర్‌లో 26వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే మరో మూడు రోజుల్లో నాని బర్త్ డే రానున్న నేపథ్యంలో ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్.

నాని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ‘టక్ జగదీష్’ టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ వెల్ల‌డించింది. దీనికి సంబంధించిన ఓ మోష‌న్ పోస్ట‌ర్‌ను కూడా సంస్థ షేర్ చేసింది. ఈ పోస్టర్‌లో నాని మరోసారి సీరియస్ లుక్‌లో కనిపిస్తుండటంతో ప్రేక్షకుల్లో టీజర్‌పై ఆసక్తి పెరిగింది.
ప్యాంట్ లేకుండా బాత్ రూములో అలా! పిచ్చెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ.. నభా నటేష్ సెక్సీ పోజు వైరల్
ఈ మూవీలో జగదీష్ నాయుడుగా నాని పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రావు రమేశ్, నాజర్, నరేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. గతంలో నాని- శివ నిర్వాణ కాంబోలో వచ్చిన ‘నిన్ను కోరి’ సినిమా సూపర్ హిట్ కావడంతో మరోసారి అదే కాంబోలో రాబోతున్న ‘టక్ జగదీష్’పై అంచనాలు పెరిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here