Tempt రాజా: Tempt రాజా ట్రైలర్.. బాబోయ్! అడల్ట్ కంటెంట్‌, బూతు డైలాగులతో రచ్చరచ్చ.. పోసాని కామెడీ హైలైట్ – tempt raja team reaction on this movie teaser

0
23


ప్రధానాంశాలు:

  • బాబోయ్.. Tempt రాజా టీజర్, ట్రైలర్
  • అడల్ట్ కంటెంట్, ఆ సీన్లు చూస్తే..
  • Tempt రాజా టీం రియాక్షన్

బాబోయ్.. ఇంతకుమించిన అడల్ట్ కంటెంట్ ఉండదేమో అన్నట్లుగా ఉన్నాయి టెంప్ట్ రాజా టీజర్, ట్రైలర్‌లోని సన్నివేశాలు. ప్రేక్షకులను ఏదో ఒకలా ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తున్న దర్శకనిర్మాతలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా బూతు, అడల్ట్ కంటెంట్‌లను నమ్ముకుంటున్నారు. ఇక ఈ సన్నివేశాలను టీజర్, ట్రైలర్‌లలో చూపించి తమ సినిమా పేరును జనం నోళ్ళలో నానేలా చేసుకుంటున్నారు. యువతను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమాల్లో శృతిమించిన శృంగార సన్నివేశాలను చూపించడం సర్వసాధారణం అయింది.

ఇప్పటికే ఇలాంటి చిత్రాలు చాలానే వచ్చాయి. ఇప్పుడు అదేబాటలో ‘టెంప్ట్ రాజా’ అంటూ కాస్త డిఫరెంట్ అండ్ బోల్డ్ టైటిల్‌తో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పూర్తి అడల్ట్ కంటెంట్‌తో రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంకేముంది ఎప్పటిలాగే జనం ఎగబడి చూడటంతో వ్యూస్ పరంగా జెట్ స్పీడులో దూసుకుపోతోంది ఈ ట్రైలర్. దీంతో ఖుషీ అవుతున్న టెంప్ట్ రాజా టీం వెంటనే ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా హీరో మరియు నిర్మాత రాంకి (వీర్నాల రామకృష్ణ) మాట్లాడుతూ.. ‘Tempt రాజా’ సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్‌గా యూత్‌ని అలరిస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్‌కి ఇంకా బాగా రెస్పాన్స్ వస్తోంది. ఎంతలా అంటే.. 10 రోజుల్లో మా సినిమా బిజినెస్ ని క్లోజ్ చేసే అంతలా ఈ టీజర్‌కి బయ్యర్స్ నుంచి ఆఫర్ వచ్చింది.

హీరోయిన్లు దివ్య రావ్, ఆస్మలు చాలా బాగా నటించారు. వీళ్ళతో పనిచేయడం నాకు కంఫర్ట్ అనిపించింది. ఫస్ట్ టైం నటిస్తున్నాననే ఫీలింగ్ లేకుండా చేశారు. ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి ఎంతో బిజీగా ఉన్నా కూడా మా సినిమాలో నటించి నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఆయన చేసిన కామెడీ సినిమాలో హైలైట్ అవుతుంది. ఇది మహిళల ఇమేజ్‌ని పెంచే ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా. రొమాన్స్ విషయంలో మహిళల ఫీలింగ్స్ ఎంటనేది చాలా సున్నితంగా తెరమీద చూపించాం” అన్నాడు.
చిరంజీవిపై శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఆచార్య కథ ఇదేనంటూ రచ్చ! ఎన్టీఆర్‌ని కూడా లాగేసింది బాబోయ్..
సే క్రియేషన్స్ బ్యానర్‌పై ఏఆర్కె ఆర్ట్స్ సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో హీరోగా రాంకి, ఫస్ట్ హీరోయిన్‌గా దివ్య రావు (డిగ్రీ కాలేజ్ ఫేమ్), సెకండ్ హీరోయిన్‌గా ఆస్మ నటించగా.. పోసాని కృష్ణ మురళి, యాంకర్ శ్యామల, టార్జెన్, జయవాణి, జోగి బ్రదర్స్ (కృష్ణ, నాయుడు) గౌతంరాజు, అశోక్ కుమార్, మేఘన చౌదరి, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ దొరబాబు, మైత్రి రజిత, దీప్తి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here