Temperature down: బాబోయ్ చలి, గడ్డకట్టిన సరస్సు.. జింకను ఎలా కాపాడారో చూడండి – lowest temperature: video of man slides a deer stuck on frozen river goes viral

0
35


లి చంపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని సరస్సులు, చెరువులు గడ్డకట్టుకుపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో వారం రోజులుగా 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక శీతల దేశాల్లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

చలికి గడ్డకట్టుకుపోయిన సరస్సుల మీద నడుస్తూ కొంత మంది పర్యాటకులు ప్రత్యేక అనుభూతి పొందుతున్నారు. అయితే.. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఓ వన్య ప్రాణి కూడా ఇలాగే ఓ గడ్డకట్టిన సరస్సు మీదకి వచ్చింది. ఆ మంచు మీద నడవలేకపోయింది. ఎంత ప్రయత్నించినా.. కాళ్లు జారిపోయి అడుగులు ముందుకు పడలేదు.

జింక అవస్థను గమనించిన ఓ స్థానికుడు దానికి సాయం చేశాడు. సరస్సు మధ్య నుంచి దాన్ని ఓ చివర వరకు చేతులతో నెట్టుకొచ్చాడు. దీంతో అది ఒడ్డుకు చేరి వనంలోకి పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ దృశ్యాలను మీరూ చూసేయండి.. వన్య ప్రాణి పట్ల అతడు చూపిన ప్రేమకు హ్యాట్సాఫ్ కూడా చెప్పండి..

చలికి గడ్డకట్టిన సరస్సు.. చిక్కుకుపోయిన జింక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here