
చిత్ర ప్రారంభోత్సవం
ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా మారిన యంగ్ హీరో తేజ సజ్జా ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించనుండగా.. ప్రియా ప్రకాష్ వారియర్ నాయికగా నటించనున్నారు. యస్.యస్.రాజు దర్శకత్వం వహించే ఈ చిత్రానికి ఆర్.బి. చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తుండగా.. ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మాతలు.
ఈ చిత్రానికి ‘ఇష్క్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ అనేది ట్యాగ్‌లైన్. ఈ మేరకు టైటిల్ పోస్టర్‌ను తేజ ఇన్స్టాగ్రామ్ ద్వారా శుక్రవారం షేర్ చేశారు. టైటిల్ ప్రకారం ఈ మూవీ రొమాంటిక్ ఎంటర్టైనర్ అనే అభిప్రాయం కలుగుతుండగా.. ట్యాగ్‌లైన్ మరో అభిప్రాయాన్ని కలిగిస్తూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫర్. శ్రీమణి పాటలు రాస్తున్నారు. ఎ. వరప్రసాద్ ఎడిటర్‌గా, విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలను చిత్ర బృందం వెల్లడించనుంది.