tandav controversy: ‘తాండవ్’ వివాదం: మండిపడుతున్న బీజేపీ.. సైఫ్ అలీ ఖాన్ ఇంటికి పోలీస్ ప్రొటెక్షన్ – tandav web series controversy: police protection at saif ali khan and kareena kapoor home

0
23


అమెజాన్ ప్రైమ్ వీడియో కొత్త వెబ్ సిరీస్ ‘తాండవ్’ వివాదంలో చిక్కుకుంది. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో హిందూ దేవతలను కించపరిచారని బీజేపీ నాయకులు, హిందూవాదులు మండిపడుతున్నారు. దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, రచయిత గౌరవ్ సోలంకిపై ఆదివారం రాత్రి లక్నోలోని హజరత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకు ముందే పౌరసమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అమెజాన్ ప్రైమ్ వీడియోకు సమన్లు జారీ చేసింది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ ‘తాండవ్’ వెబ్ సిరీస్‌పై బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే రామ్ కదమ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముంబైలోని ఘట్కోపర్‌ పోలీస్ స్టేషన్‌లో తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ వెబ్ సిరీస్ ద్వారా హిందువులను కించపరిచారని ఆయన ఆరోపించారు. ఈ వివాదంపైనే మంగళవారం మీడియాతో మాట్లాడిన రామ్ కదమ్.. ‘జూతే మారో’ ఉద్యమం చేపట్టి అమెజాన్ ప్రైమ్ వీడియో కార్యాలయాలను చుట్టుముడతామని హెచ్చరించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్వాహకులు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, బీజేపీ ఎంపీ మనోజ్ కోటక్ ఈ వివాదంపై సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు లేఖ రాశారు. హిందూ దేవతలను అవమానించిన ఈ వెబ్ సిరీస్‌పై తక్షణమే నిషేదం విధించాలని ఆయన లేఖలో కోరారు. అలాగే, అయోధ్యకు చెందిన స్వామీజీలు కూడా ‘తాండవ్’ వెబ్‌ సిరీస్‌పై గొంతెత్తారు. ఈ సిరీస్‌తో పాటు అందులో నటించిన నటీనటులను నిషేదించాలని తపస్వి ఛావని ఆలయానికి చెందిన మహంత్ పరమహంశ దాస్ డిమాండ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ద్వారా హిందువుల ఆరాధ్య దైవాలైన రాముడు, శివుడును కించపరిచారని ఆయన మండిపడ్డారు.

‘జెర్సీ’ బాలీవుడ్ రీమేక్: దీపావళి టార్గెట్.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఇక దేశంలో చాలా చోట్ల బీజేపీ కార్యకర్తలు, హిందూవాదులు ‘తాండవ్’కు వ్యతిరేకంగా రోడ్లెక్కుతున్నారు. ‘తాండవ్’ పోస్టర్లను తగలబెడుతున్నారు. సైఫ్ అలీ ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ వివాదం నేపథ్యంలో ముంబైలోని సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ దంపతుల ఇంటి వద్ద ప్రభుత్వం పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటుచేసింది. వాస్తవానికి ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కుటుంబం కొత్త ఇంట్లోకి మారుతోంది. ప్రస్తుతం ఉన్న ఇంటికి సమీపంలోని ఈ కొత్త ఇంటిని సైఫ్ అలీ ఖాన్ కొనుగోలు చేశారు. ఆదివారం నుంచే షిప్టింగ్ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఈ వివాదం తలెత్తింది. దీంతో వారికి ప్రభుత్వం పోలీస్ రక్షణ ఏర్పాటుచేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here