తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సులో ఫుట్‌బోర్డు ప్రయాణం ఐదుగురు ప్రయాణికులను బలి తీసుకుంది. బస్సు ఓ ప్రాంతంలో కరెంట్ తీగల సమీపం నుంచి వెళ్తుండగా ఫుట్‌బోర్డులో వేలాడుతున్న కొంత మంది ప్రమాదవశాత్తూ ఆ తీగలకు తాకి, విద్యుదాఘాతానికి గురయ్యారు. అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బస్సు కూడా కరెంట్ షాక్‌కు గురై మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో మరో 10 మంది వరకు గాయపడ్డారు.