SVBCలో ఆ ఉద్యోగాలు వైసీపీ వాళ్లవే.. ఆడదాన్ని అడ్డంపెట్టి తొక్కేశారు: అసలు గుట్టు విప్పన పృథ్వీ

0
26థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ కమెడియన్‌గా స్టార్ ఇమేజ్ సంపాదించిన .. ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ అయిన తరువాత విమర్శల పాలయ్యాడు. మహిళా ఉద్యోగినితో ‘వెనుక నుండి పట్టుకుంటా..’, ‘గుర్తుకు వస్తున్నావ్..’ అంటూ అసభ్యకరంగా ఆడియో కాల్ మాట్లాడుతూ తన పదవిని పోగొట్టుకుని పృథ్వీ. అయితే ఇదంతా కుట్ర ప్రకారమే చేశారని.. తన ఎదుగుదలను తట్టుకోలేక కొంతమంది ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని ఆ ఆడియో కాల్ అంతా ఫేక్ అని ఖండిస్తూ వస్తున్నారు పృథ్వీ.

అయితే మొదటి నుంచి వైసీపీ పార్టీకి వీర విధేయుడుగా ఉన్న పృథ్వీ.. ఈ ఆడియో కాల్ ఇష్యూ తరువాత పార్టీ కార్యక్రమాలను దూరంగానే ఉంటున్నారు. అయితే తాజాగా ఈ ఇష్యూపై మరోసారి స్పందిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులపై సంచలన కామెంట్స్ చేశారు.

ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎస్వీబీసీ చైర్మన్‌గా నాకు అప్పగించిన బాధ్యతను నేను పూర్తి స్థాయిలో నిర్వర్తించాను. ఎక్కడ చూసినా వీడే కనిపిస్తున్నాడని నన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.. అదేం నా పెళ్లి కాదు.. నాకు అప్పగించిన పనిని అద్భుతంగా చేయాలని అనుకున్నాను.. అది కొంతమందికి నచ్చలేదు. దాంతో నన్ను అన్ని రకాలుగా అణచివేశారు. తిరుమల కొండపై కిక్ కొడితే వచ్చి మళ్లీ జూబ్లీహిల్స్‌లో పడ్డాను.

నేనేం వాళ్ల ఆస్తులకు.. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు పోటీ కాదు. ఒక ఎస్వీబీసీకి చైర్మన్‌గా ఉన్నప్పుడు నేను యాటిట్యూడ్ చూపించలేదు. చాలా సింపుల్‌గా ఉండేవాడిని. ఇంత నిరాడంబరంగా ఉన్న నన్నే బయటకు తోసేశారు. వాళ్లకి ఎథిక్స్ లేవు.. మోరల్ వాల్యూస్ లేవు.

విజయసాయి రెడ్డిగారికి లెటర్ రాస్తే.. అవన్నీ తిరిగి వచ్చి నాకే గుచ్చుకున్నాయి. అందరూ బాగానే ఉన్నారు. నాకు ఒక్కడికే సమస్య వచ్చింది. నేను స్టాఫ్ కూడా కొత్తగా తీసుకున్నది లేదు.. పాత వాళ్లని తీసేయలేదు. కాంట్రాక్ట్ బేసిక్ మీద కొంతమందిని తీసుకుంటే వాళ్లంతా కూడా వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల రికమండేషన్ మీద వచ్చిన వాళ్లే. బయటవాడు ఎవడూ లేడు. పృథ్వీ తీసుకొచ్చి పెట్టింది ఎవడూ లేడు. వాళ్ల కాంట్రాక్ట్ అయిపోయిన తరువాత మీ టైం అయిపోయింది.. మళ్లీ కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు తీసుకుంటాం అని చెప్పా.

38 మందిని నేను తీసేస్తున్నా అని మహా న్యూస్ సీఈఓ వెంటక నగేష్ తప్పుడు ప్రచారం చేశాడు. నేను ఎవర్నీ ఉద్యోగాల్లో నుంచి తీసేసి కొత్తగా వేరే వాళ్లని పెట్టుకోలేదు. రూల్స్ ఫాలో అయ్యాను. దాన్ని తప్పుగా ప్రచారం చేసి నన్ను బయటకు నెట్టారు.

నేను ఎప్పుడూ ఎన్టీఆర్‌తో.. చిరంజీవితో ఫొటో దిగుతా అనుకోలేదు. వైఎస్ గారితో అలాగే జగన్‌ గారితో క్లోజ్‌గా ఉండి పాదయాత్ర చేస్తా అనుకోలేదు. ఇవన్నీ నాకు ఇచ్చింది సినిమా రంగం. ఇలాంటి చిన్న చిన్న విషయాలను భయపడకూడదని అనుకున్నా. బాధలో ఉంటే ఎస్వీ రంగారావుగారి డైలాగ్‌లు వింటా. నర్తనశాల సినిమాలో ఆడదాని మనసు జయించడం అసంభవం బావా అని అంటారు. అలా ఇప్పుడు నన్ను ఒక ఆడదాన్ని పెట్టి కొట్టారు. వాళ్లు అలా ప్లాన్ చేసినందుకు నాకు హ్యాపీనే’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు పృథ్వీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here