పాకిస్థాన్ గడ్డపై మరో సర్జికల్ దాడి జరిగింది. ఈసారి ఇరాన్ ఆ పని చేసింది. పాక్‌లో బందీగా ఉన్న తమ దేశ సైనికులను విడిపించుకుపోయింది. ఈ సంచలన విషయాన్ని అనదోలు (Anadolu) న్యూస్ ఏజెన్సీ గురువారం (ఫిబ్రవరి 4) వెల్లడించింది. ఇరాన్‌కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) పాకిస్థాన్ భూభాగంలో ఆపరేషన్ నిర్వహించాయని ఆ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.