ప్రధానాంశాలు:
- సునీత్ రెండో పెళ్లితో సురేఖవాణిపై మొదలైన వదంతులు
- కూతురి కోరిక మేరకు రెండో పెళ్లి చేసుకుంటున్నారని ప్రచారం
- ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసిన సురేఖవాణి
ఇదిలా ఉంటే, నటి సురేఖవాణి త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వదంతులు రెండు రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. కూతురు సుప్రీత కోరిక మేరకు సురేఖవాణి రెండో పెళ్లి చేసుకోబుతున్నారని కొన్ని వెబ్సైట్లలో వార్తలు ప్రచురితమయ్యాయి. దీంతో సోషల్ మీడియాలోనూ ప్రచారం మొదలైంది. అయితే, ఈ వార్తలపై సురేఖవాణి స్పందించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా సురేఖవాణి క్లారిటీ ఇచ్చారు.
తన రెండో పెళ్లిపై ఓ వెబ్సైట్లో ప్రచురితమైన వార్త ఫేస్బుక్ పోస్ట్‌ను స్క్రీన్ షాట్ తీసి దాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు సురేఖవాణి. దానిపై ‘ఫేక్ న్యూస్’ అని రాశారు. ఇంకేముంది.. సురేఖవాణి రెండో పెళ్లి ఒక అబద్ధం. అంతేకాదు, ఓ వెబ్సైట్లో ప్రచురితమైన ఈ పెళ్లి వార్తను సురేఖవాణి ఫేస్బుక్లో షేర్ చేశారు. అయితే, ఇది సురేఖవాణి ఒరిజినల్ ఫేస్బుక్ అకౌంట్ కాదు. అసలు తనకు ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లే లేవని సురేఖవాణి స్పష్టం చేశారు. కేవలం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉందని వెల్లడించారు.

సురేఖవాణి ఇన్స్టాగ్రామ్ స్టోరీలు
ఇదిలా ఉంటే, సురేఖవాణి భర్త సురేష్ తేజ అనారోగ్యంతో 2019లో కన్నుమూశారు. ఈ దంపతులకు సుప్రీత ఒక్కరే సంతానం. సురేఖవాణి రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో నటిగా రాణిస్తున్నారు. తాజాగా ఆయన ‘డర్టీ హరి’ సినిమాలో కనిపించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ సురేఖవాణి నటిస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన ‘మాస్టర్’ సినిమాలో సురేఖవాణి నటించారు. సినిమాలతో పాటు ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా సురేఖవాణి అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు.