తల్లి పక్కన నిద్రిస్తున్న బాలికను యువకుడు అపహరించుకుపోతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాలిక అరవకుండా ఆమె నోరునొక్కి పట్టి ఎత్తుకెళ్లాడు. పాపను పక్క వీధిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక ఒళ్లంతా కొరికాడు. ఆమె లైంగిక అవయవాలను గాయపరిచాడు. ఓరల్ సెక్స్ కోసం బాలికను వేధించాడు. అఘాయిత్యం చేసిన తర్వాత బాలికను అక్కడే వదిలేసి పారిపోయాడు.
కాసేపటి తర్వాత బాలిక ఏడుస్తూ తన తల్లి వద్దకు పరుగెత్తుకొస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో కనిపిస్తున్నాయి. అప్పటికి ఆ తల్లి అలాగే నిద్రిస్తూ ఉంది. పాప ఏడుపు విని ఉలిక్కిపడి లేచిన తల్లికి ఆ బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. బుధవారం ఉదయం ఆ బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది.
నిందితుడిని జమ్మూ పఠాన్ (20)గా పోలీసులు గుర్తించారు. ఆ తల్లీబిడ్డలు నిద్రించిన ఫుట్‌పాత్‌కు సమీపంలో మరో ఫుట్‌పాత్‌పై అతడు నిద్రించేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బాలిక మెడ, వీపు, చేతులు, తొడ భాగంలో పంటి గాట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రైవేట్ పార్ట్స్ వద్ద తీవ్రమైన గాయాలైనట్లు వెల్లడించారు. బాధిత బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.