Sukumar: సుకుమార్ కారణంగా మళ్లీ దొరికిపోయిన నాగబాబు.. అప్పుడలా అయితే ఇప్పుడిలా! నెటిజన్స్ ట్రోలింగ్

0
25



రియల్ లైఫ్ మాటేమిటో గానీ సోషల్ మీడియాలో ఎలాంటి చిన్న తప్పు చేసినా క్షణాల్లో దొరికిపోతుంటారు సెలబ్రిటీలు. ఫొటోలు పోస్ట్ చేయడం, కామెంట్స్ రాయడం అన్నింటా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం పొరపాటు జరిగినా ట్రోలింగ్ వీరులు రంగంలోకి దిగి ఆడుకుంటారు. ఇటీవల విషయంలో ఇదే జరగడంతో తెగ ట్రోల్ చేశారు. అయితే దాన్నుంచి పూర్తిగా బయటకురాకముందే మరో చిన్న తప్పుడు పోస్ట్ చేసి బుక్కయ్యారు మెగా బ్రదర్.

రీసెంట్‌గా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఫొటోకి బదులు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఫోటోను షేర్ చేశారు నాగబాబు. కపిల్ దేవ్ బయోపిక్‌గా వస్తోన్న 83 సినిమా పోస్టర్ నుంచి రణ్‌వీర్ సింగ్ స్టిల్‌ను ఆయన పోస్ట్ చేయడంతో నాగబాబుపై ట్రోల్స్ నడిచాయి. ఇది గమనించి వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేశారు. ఇక్కడకి వరకూ బాగానే ఉన్నా తాజాగా మరోసారి సరిగ్గా అలాంటి పనే చేసి ఆశ్చర్యపరిచారు నాగబాబు. డైరెక్టర్ సుకుమార్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంలో చిన్న పొరపాటు చేశారు.

నిన్న (జనవరి 10) బడా నిర్మాత అల్లు అరవింద్ బర్త్ డే. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్ తెలుపుతూ ఓ నాలుగు గొప్ప మాటలు చెప్పిన నాగబాబు.. ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్‌కి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టారు. ఇంకేముంది నెటిజన్స్ వెంటనే దీన్ని స్క్రీన్ షాట్ తీసి ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఎందుకంటే (జనవరి 10) నిన్న కాదు (జనవరి 11) నేడు. దీంతో ఆ పోస్ట్ డిలీట్ చేసేశారు నాగబాబు.

ఉదేశ్యం మంచిదే అయినా అది సోషల్ మీడియా. సెలబ్రిటీలు ఏ చిన్న తప్పు చేసినా ట్రోలింగ్ ఖాయం. ఇది చాలా సార్లు రుజువైంది కూడా. ఇప్పుడు నాగబాబు విషయంలో రెండుసార్లు వరుసగా జరిగింది. దీంతో ఇలాంటివి చూసి తమ తమ అభిమాన తారలకు సోషల్ మీడియాలో జాగ్రత్త సుమా! అంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here