Srinagar terror attack: శ్రీనగర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. పోలీసుల వీరమరణం – terrorists fire bullets near shiv shakti sweet shop in srinagar, two cops martyred

0
28


శ్రీనగర్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసురుతున్నారు. శ్రీనగర్‌లో ఇటీవలే కృష్ణ దాబాపై దాడి చేసిన టెర్రరిస్టులు తాజాగా శివశక్తి స్వీట్ షాప్‌పై దాడి చేశారు. స్వీట్ షాప్ ముందున్న పోలీసులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డారు. టెర్రరిస్టుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పోలీసులను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారని ఉన్నతాధికారులు తెలిపారు. శ్రీనగర్‌లోని బర్జుల్లా ప్రాంతంలో శుక్రవారం (ఫిబ్రవరి 19) మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.

శివశక్తి షాప్ ముందున్న పోలీసులపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉగ్రవాదుల దాడి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. సాయుధుడైన ఓ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో ఉగ్రవాది కోసం తీవ్రంగా గాలిస్తు్న్నారు. ఆ ప్రాంతాన్ని మొత్తం తమ అదుపులోకి తీసుకున్నారు.

స్థానికేతరులు, హిందువులే లక్ష్యంగా..
వారం రోజుల కిందట శ్రీనగర్‌లోని పాపులర్ ఫుడ్ జోన్ కృష్ణ దాబాపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాబా యజమాని కుమారుడిని కాల్చి చంపారు. కొంత మంది విదేశీ రాయబారులు అక్కడ పర్యటిస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి విదేశీ ప్రతినిధుల బృందం అక్కడ పర్యటనకు వచ్చింది.

ఈ ఘటనతో స్థానికుల్లో అభద్రతా భావం నెలకొంది. స్థానికేతరులు, హిందువులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. బుద్గామ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here