ప్రధానాంశాలు:
- చిరంజీవి హీరోగా ‘ఆచార్య’
- ఇటీవలే విడుదలైన టీజర్
- శ్రీ రెడ్డి ఎంటరై రచ్చరచ్చ
ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందిస్తున్న ‘ఆచార్య’ కథ తనకు తెలుసంటూ స్టోరీ లైన్ చెప్పేసింది శ్రీ రెడ్డి. ”చిరంజీవి ఎక్కడి నుండో ఒక ఊరికి వస్తాడు, ఆ ఊర్లో వాళ్ళకి దేవుడిలా వాళ్ళ కష్టాలు తీరుస్తాడు. అంతే” అంటే అని పేర్కొంటూ ఆచార్య టీజర్ జత చేసింది. అంతటితో ఆగక ఈ ఆచార్య టీజర్ గురించి తన రివ్యూ చెబుతూ మధ్యలో జూనియర్ ఎన్టీఆర్‌ని కూడా లాగేసింది. ”అబ్బే, ఎంతైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి నటన ముందు చిరంజీవి కూడా సరిపోదు. ఆచార్య ట్రైలర్లో డైలాగ్ డెలివరీ అస్సలు బాగోలేదు” అంటూ ఓపెన్‌గా చెప్పేసింది. ఇక దీనిపై నెటిజన్ల స్పందన, కామెంట్లు అంటారా.. అయ్య బాబోయ్! సోషల్ మీడియాలో పెద్ద రచ్చే క్రియేట్ అయిందిలెండి.
కాస్టింగ్ కౌచ్ ఉద్యమం తర్వాత హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చిన శ్రీ రెడ్డి.. సోషల్ మీడియా వేదికగా నిత్యం పలు అంశాలపై స్పందిస్తూ అప్పుడప్పుడూ బూతుపురాణాలు వినిపిస్తోంది. సెక్సీ ఫొటోలు, వీడియోలతో రచ్చరచ్చ చేస్తూ ఎలాగోలా అందరి దృష్టి తనవైపు మరల్చుకుంటోంది. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే అమ్మడికి సోషల్ మీడియా ఫాలోయింగ్ మాత్రం చాలా ఎక్కువండోయ్.
ఇక ఆచార్య సినిమా విషయానికొస్తే.. చిరంజీవి 152వ సినిమాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. రామ్ చరణ్ నిర్మాణ భాగస్వామిగా ఉంటూనే ‘సిద్ధ’ అనే కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే విడుదలైన టీజర్, అదేనండీ శ్రీ రెడ్డి కామెంట్ చేసిన ఆ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది.