ప్రధానాంశాలు:
- హాట్ ఫొటో షేర్ చేసిన శ్రీ రెడ్డి
- రెచ్చిపోతున్న నెటిజన్స్
- పెళ్లి, ప్రెగ్నెన్సీ మ్యాటర్‌పై రియాక్షన్
కాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేసి ప్రస్తుతం చెన్నైలో మకాం వేసిన శ్రీ రెడ్డి, సామాజిక మాధ్యమాలను వాడుకోవడంలో తనకెవ్వరూ సాటిలేరన్నట్లుగా దూసుకుపోతోంది. ఏ చిన్న సందర్భం కంటపడినా అటు బడా సినీ తారలను, ఇటు పొలిటిషన్స్‌ని తనదైన వ్యాఖ్యలతో ఓ ఆట ఆడుకుంటున్న ఆమె, గత కొన్ని నెలలుగా తన బాడీ పార్ట్స్‌పై ఫోకస్ పెట్టింది. తన గ్లామర్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ స్టార్ హీరోయిన్లతో పోల్చుకుంటోంది. తన బాడీలోని అంగాంగంపై రొమాంటిక్ కామెంట్లు చేస్తూ మంట పుట్టిస్తోంది. ఇక అమ్మడి నోటివెంట వచ్చే పచ్చి డైలాగులైతే అబ్బబ్బో.. మనం ఇక్కడ ప్రస్తావించడం చాలా కష్టం.
ఈ క్రమంలోనే తాజాగా తెల్లచీర కట్టి నాభి అందాలను బయటపెట్టేస్తూ ఓ సెల్ఫీ ఫొటో వదిలిన శ్రీ రెడ్డి.. ”నా ఫ్యాన్స్ అంతా రెడీగా ఉండండి.. త్వరలోనే ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఇది మీ అందరికీ చాలా పెద్ద గుడ్ న్యూస్ అవుతుంది” అంటూ దీనిపై ట్యాగ్ చేసింది. ఇంకేముంది ఆ హాట్ అందాలను తనివితీరా ఆస్వాదిస్తూ అమ్మడి ట్యాగ్‌లైన్‌పై రియాక్ట్ కావడం మొదలెట్టేశారు కొందరు నెటిజన్లు.
ఆ కామెంట్లతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. అయితే ఓ నెటిజన్ మాత్రం కాస్త వెరైటీగా ఆలోచించి ‘ఆ పార్ట్ చుపిస్తున్నావంటే కడుపుతో ఉన్నావా ఏంటీ’ అని ప్రశ్నించాడు. దీంతో దీనిపై రియాక్ట్ అయిన శ్రీ రెడ్డి.. ‘అరేయ్ వెదవల్లారా.. నేను ప్రెగ్నెంట్ కాదు.. అంతకు మించిన గుడ్ న్యూస్’ అని పేర్కొంది. మరో నెటిజన్ పెళ్లా? అని అడగ్గా పెళ్లి కూడా కాదని చెప్పింది. దీంతో ఇంతకీ శ్రీ రెడ్డి చెప్పబోయేదేంటి? అనే దానిపై ఆన్లైన్ చర్చ మొదలైంది.