ప్రధానాంశాలు:
- కొన్ని రోజులుగా శ్రీముఖి పెళ్లిపై కొనసాగుతున్న చర్చలు
- తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనేస్తూ రాములమ్మ ఓపెన్
- శ్రీముఖి వార్నింగ్, సుమ పంచ్
స్టార్ మాలో ‘స్టార్ట్ మ్యూజిక్’ అనే కొత్త షో ప్రసారమవుతోంది. ఈ షోకి బుల్లితెర మాటల మహారాణి సుమ హోస్ట్‌గా చేస్తోంది. ఈ ఆదివారం ప్రసారం కాబోతున్న ఈ షో ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. శ్రీముఖి, విష్ణు ప్రియ, హరి, పండు మాస్టర్, ఆర్జే చైతూ, రోల్ రైడాలు ఈ షోకి అటెండ్ అయ్యారు. ఇందులో సుమ- శ్రీముఖి మధ్య జరిగిన సంభాషణ, శ్రీముఖి బాయ్ ఫ్రెండ్ వ్యవహారం హైలైట్ అవుతోంది.
ఇక్కడ కనిపిస్తున్నవారిలో ఏ హీరో అంటే ఇష్టమంటూ శ్రీముఖిని ఇరికించే ప్రయత్నం చేసింది సుమ. అయితే తనకు చిరంజీవి అంటేనే ఇష్టమంటూ ఓపెన్‌గా చెప్పేసింది శ్రీముఖి. ఇక ఆ వెంటనే.. ఒకవేళ రొమాంటిక్ డేట్‌కి వెళ్లాల్సి వస్తే ఎవరితో వెళ్తావని సుమ మరో ప్రశ్న వేయడంతో శ్రీముఖి అసలు విషయం బయటపెట్టింది. ”ఆల్రెడీ కమిటెడ్.. ఇప్పుడు నేనిలా డేటింగ్ వెళ్తే నా బాయ్ ఫ్రెండ్ ఫీలవుతాడు. నాకంటూ కొన్ని నియమాలున్నాయి” అంటూ అందరిముందే బాంబ్ పేల్చింది శ్రీముఖి. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు.
ఇకపోతే ‘పండు కొంచెం లిమిట్స్‌లో ఉండు నువ్వు’ అంటూ శ్రీముఖి ఇచ్చిన వార్నింగ్, ‘అన్నిచోట్లకు వెళ్లి నువ్వు పండక్కర్లే’ అని సుమ వేసిన పంచ్ ఈ షోపై ఆసక్తిని పెంచుతున్నాయి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సో.. మరి ఫుల్ ఎపిసోడ్ వస్తే గానీ చెప్పలేం తన బాయ్ ఫ్రెండ్ గురించి శ్రీముఖి అన్నీ చెప్పిందా? లేదా అనేది.