విలక్షణ కథలతో, భిన్న తరహా చిత్రాలతో, అభినయానికి అవకాశం ఉన్న పాత్రలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శ్రీవిష్ణు.. ఒకదాని తర్వాత ఒకటిగా ఆసక్తికర సినిమాలను అంగీకరిస్తూ వస్తున్నారు. ‘రాజ రాజ చోళ’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవగా.. ‘గాలి సంపత్’, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందుతున్న టైటిల్ ఖరారు చేయని సినిమా షూటింగ్‌లు ప్రస్తుతం జరుగుతున్నాయి.
ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తుండగా.. శివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. మిగతా టెక్నీషియన్ల పేర్లను త్వరలో వెల్లడించనున్నారు. 2021 ప్రారంభంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొ్ంది.