ప్రధానాంశాలు:
- బిజీరోడ్డుపైకి ఓ నాగుపాము ఎంట్రీ ఇచ్చింది.
- పాము కారణంగా 30 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.
- కర్ణాటకలోని ఉడుపిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కర్ణాటకలోని ఉడుపి జిల్లా కల్సంకా జంక్షన్ వద్ద గురువారం (ఫిబ్రవరి 11) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. కాంక్రీట్ తారు రోడ్డు కావడం, పైగా సూర్యరశ్మి వల్ల అది వేడిగా ఉండటం వల్ల ఆ సర్పం రోడ్డు దాటడానికి ఇబ్బంది పడింది. చాలా ఒడుపుగా ముందుకు కదిలింది. వాహనదారులు కూడా ఓపికగా ఉండి, ఆ పాము బెరుకులేకుండా ముందుకు కదలడానికి సహకరించారు.

బిజీ రోడ్డుపైకి నాగరాజు.. 30 నిమిషాలు ట్రాఫిక్ జామ్
నాగుపాము బిజీ రోడ్డును క్రాస్ చేస్తున్న దృశ్యాలను అక్కడే ఉన్న కొంత మంది వాహనదారులు, స్థానికులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది వైరల్గా మారింది.
సుమారు 30 నిమిషాల సంఘర్షణ అనంతరం ఆ పాము రహదారిని దాటింది. ఆ తర్వాత ఓ వన్యప్రాణి ప్రేమికుడు దాన్ని చాకచక్యంగా పట్టుకున్నాడు. చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తీసుకెళ్లాడు. చికిత్స అనంతరం ఆ సర్పాన్ని అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు సమాచారం. ట్రాఫిక్ అంతరాయం తప్ప ఆ సర్పం ఎవరికీ, ఎలాంటి హాని తలపెట్టలేదని ట్రాఫిక్ ఎస్ఐ ఖాదిర్ తెలిపారు.