Siva Balaji: బాబోయ్.. శివ బాలాజీ- మధుమిత లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా..? ఓపెన్ అయిన సెలబ్రిటీ జోడీ – alitho saradaga: shiva balaji- mahumitha open up on their love story

0
23


లవ్ స్టోరీ అన్నాక ట్విస్టులు కామనే కదా! అది సినిమా అయినా.. నిజ జీవితమైనా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందంటే ఆ ప్రేమ కథలో ఎన్నో మలుపులు, మరెన్నో ట్విస్టులు ఉండటం చూస్తూనే ఉంటాం. ఇక సెలబ్రిటీ కపుల్స్ ప్రేమ కథలు, అందులో ట్విస్టులంటే ఆ ఆసక్తి చెప్పగలమా..?? సరిగ్గా అదే పాయింట్‌ని టార్గెట్ చేస్తూ తాజాగా జరిగిన ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో శివ బాలాజీ- మధుమిత లవ్ స్టోరీకి సంబంధించి సీక్రెట్స్ అన్నీ రాబట్టారు ఆలీ. ఇటీవలే జరిగిన ఈ ఎపిసోడ్ చూస్తుంటే ఈ సెలబ్రిటీ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులున్నాయనా? అని ఆశ్చర్యం కలుగుతోంది.

శివ బాలాజీ- మధుమిత పరిచయం ఎక్కడ అయింది.? ఎలా అయ్యింది? లవ్ ప్రపోజ్ చేయడంలో ఎవరు ముందు? పెళ్లికి ముందు ఎందుకు బ్రేకప్ కావాలనుకున్నారు? లాంటి ప్రశ్నలతో ఆలీ వాళ్ళిద్దరి నుంచి సమాధానాలు రాబట్టారు. శివ బాలాజీ- మధుమిత సైతం తమ ప్రేమకు సంబంధించిన అన్ని విషయాలపై ఏ మాత్రం సందేహించకుండా సమాధానాలివ్వడంతో ఈ షో తాలూకు వీడియో యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ హవా నడిపిస్తోంది.

శివబాలాజీ మీకు ఎక్కడ పరిచయం? అనే ప్రశ్నపై స్పందించిన మధుమిత.. 2004 తమిళనాడులోని గోపిచెట్టిపాలెంలో ‘ఇంగ్లీస్‌ కారన్‌’అనే చిత్ర షూటింగ్‌ సమయంలో ఆయనతో పరిచయం ఏర్పడిందని, అప్పటికి ఆయన కంటే ఇండస్ట్రీలో నేనే రెండేళ్లు సీనియర్ అని చెప్పారు. ఇంగ్లీష్ కారన్‌ దర్శకుడు శక్తి సిదంబరన్‌ మా ఇద్దరి మధ్య ప్రేమకు మొదట బీజం వేశారని ఆమె తెలిపారు. ఆయన క్రియేట్ చేసిన ఓ రూమర్‌తో మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అంతా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు మధుమిత.

ఇక లవ్ ప్రపోజ్ గురించి ఓపెన్ అయిన ఈ జోడీ.. తమ మధ్య లవ్‌ ప్రపోజల్స్‌ లాంటివేమీ లేవని, నేరుగా పెళ్లి టాపిక్‌కే వెళ్లిపోయామని చెప్పారు. తనకెలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నానో మధుని చూస్తే ఆ ఫీలింగ్ కలిగిందని శివబాలాజీ చెప్పారు. అయితే మొదట శివబాలాజీ ఇంట్లోవాళ్లు ఒప్పుకున్నారు కానీ మా ఇంట్లో వాళ్లు మాత్రం ఒప్పుకోలేదని చెప్పుకొచ్చారు మధుమిత. ఎప్పుడూ తనవెంటే ఉండే తన తల్లికి శివబాలాజీకి కోపం ఎక్కువ, పైగా ఇండీస్ట్రీ వాళ్లు వద్దు అనే కోణంలో ఆలోచించి ఒప్పుకోలేదని మధుమిత చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం నా కూతురు కంటే నా అల్లుడే గ్రేట్ అని తన తల్లి చెబుతుందని ఆమె తెలిపారు.
F3: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వుల ప్రయాణంలో మరో మెగా హీరో.. పక్కాగా ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి!
ఇకపోతే పెళ్లికి ముందు తమ లవ్ స్టోరీలో ఎవ్వరికీ తెలియని ఓ బ్రేకప్ స్టోరీ ఉందంటూ ఓపెన్ అయ్యారు శివ బాలాజీ- మధుమిత. మా ఇద్దరి మధ్య ఎలాంటి అవాంతరాలు రానప్పటికీ.. మా ఇద్దరి జాతకాలు కలవలేదని, ఒకవేళ మేమిద్దరం పెళ్లి చేసుకుంటే అత్తమ్మకు ఆయుక్షీణం ఉంటుందని జాతకాల్లో తెలియడంతో ఓ సంవత్సరం బ్రేక్ అయ్యామని మధుమిత చెప్పారు. ఇదే విషయమై శివబాలాజీ స్పందిస్తూ ఆ సంఘటన తననెంతో బాధపెట్టిందని అన్నారు. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి, చివరకు జాతకాలు కలవట్లేదని చెప్పడం తనను ఎంతో ఇబ్బంది పెట్టిందని చెప్పారు. అయితే ఇద్దరి ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలని ఫిక్సయిన తమకు సంకల్పబలం తోడు కావడంతో చివరకి మళ్ళీ జాతకాలు కలిశాయని అలా ఒక్కటయ్యామని అన్నారు శివబాలాజీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here