ప్రధానాంశాలు:
- మరుసటి రోజే చెల్లెలి పెళ్లి
- సోషల్ మీడియాలో అభ్యంతరకర ఫొటోలు
- అప్లోడ్ చేసిన మాజీ ప్రియుడు
మరో 24 గంటల్లో ఆమె పెళ్లి జరగాల్సి ఉండగా.. ఆ సమయంలో ప్రియుడితో హద్దులు దాటిన అభ్యంతరకర ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మాజీ ప్రియుడు ఖాసిం ఆమె అశ్లీల చిత్రాలను ఇంటర్నెట్లో పెట్టాడు. అవి చూసిన యువతి అన్న తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడు. పెళ్లికి ముందే హద్దులు దాటిన చెల్లెలిపై కోపంతో దారుణానికి పాల్పడ్డాడు. ఆమెను తుపాకీతో కాల్చి చంపేశాడు. బుల్లెట్ తలలో నుంచి దూసుకెళ్లడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఆమె గతంలో ఖాసింతో సన్నిహితంగా ఉండేదని.. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె సోదరుడు ఆగ్రహంతో హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: