singer sunitha marriage: Nagababu: సింగర్ సునీత పెళ్లిపై హాట్ టాపిక్‌గా నాగబాబు ట్వీట్ – mega brother nagababu tweet on singer sunitha second marriage

0
25


టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాంగో మూవీస్‌ అధినేత రామ్‌ వీరపనేనిని సునీత రెండో వివాహం చేసుకున్నారు. శంషాబాద్‌లోని అమ్మపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో సన్నీహితులు-బంధువుల మధ్య వీరి వివాహం వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా సునీత-రామ్ దంపతులకు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియజేస్తున్నారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేయగా.. దీనిపై హాట్ టాపిక్ నడుస్తోంది.

ఆనందం అనేది పుట్టుకతో రాదని.. దానిని మనం వెతికి అందుకోవాలని పేర్కొన్నారు. సునీత-రామ్‌లు తమ సంతోషాలను వెతికి గుర్తించినందుకు అభినందనలు తెలియజేస్తూ.. సునీత-రామ్‌ల జంట ధైర్యంగా ముందడుగు వేయాలనుకునే అనేకమంది జంటలకు ఆదర్శం అని ఆయన పేర్కొన్నారు. ప్రేమ, సంతోషం అనేది ఎప్పటికీ మీ పర్మనెంట్ అడ్రెస్‌గా మారాలని కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సునీత, రామ్’ ట్వీట్ చేశారు నాగబాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here