Singer sunitha: భర్తతో హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సింగర్ సునీత.. లవ్లీ పిక్ షేర్ చేస్తూ ప్రేమపై సందేశం – singer sunith honeymoon trip photo viral

0
35


ప్రధానాంశాలు:

  • సునీత హనీమూన్ ట్రిప్
  • భర్తతో జాలీగా ఎంజాయ్ చేస్తున్న సింగర్
  • ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాంగ్

ఈ మధ్యకాలంలో సింగర్ సునీత రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఆమె రెండో వివాహం చేసుకోవడమే అని చెపుకోవచ్చు. ఆమె పెళ్లి ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా సునీతకు సంబంధించిన వార్తలు ఏదో ఒక విధంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన హనీమూన్ పిక్ షేర్ చేస్తూ ప్రేమికుల రోజు సందర్భంగా లవ్లీ మెసేజ్ పెట్టింది సునీత. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

జనవరి 9వ తదీన మీడియా పర్సన్ రామ్ వీరపనేనిని పెళ్లాడింది సునీత. కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. సునీత పిల్లలిద్దరూ దగ్గరుండి ఈ వేడుక జరిపించారు. అప్పటినుంచి సునీత పెళ్లిపై ఎన్నో వార్తలు షికారు చేస్తున్నాయి. ఆమె రెండో వివాహంపై నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్, ప్రస్తుతం సునీత జీవితం వీటిపైనే ఫోకస్ పెడుతున్నారంతా. ఈ నేపథ్యంలో తన భర్తతో కలిసి అందమైన ప్రదేశం మాల్దీవులకు హనీమూన్ ట్రిప్ వేసిన సునీత.. అక్కడి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంటోంది.
కేసీఆర్ పుట్టినరోజు.. అదే ఆలోచనలో ఉన్నారా? అయితే రండి అంటూ వీడియోతో ముందుకొచ్చిన అనసూయ
‘లవ్‌ ఈజ్‌ ఇన్‌ ద ఎయిర్’‌ అని ప్రేమ సందేశం పోస్ట్ చేస్తూ మోడ్రన్ లుక్‌లో ఉన్న తన పిక్ షేర్ అట్రాక్ట్ చేసింది సునీత. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ లుక్‌లో ఆమెను చూసి ఫిదా అవుతున్నారు సునీత ఫ్యాన్స్. అంతేకాదు సముద్ర తీరాన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఓ పాట కూడా పాడి ఆ వీడియోను అభిమానులతో పంచుకుంది సునీత. ఏదేమైనా, సునీత రెండో పెళ్లి గురించి ఎవరెన్ని మాట్లాడుకున్నా ఆమె మాత్రం అవేవీ పట్టించుకోకుండా భర్త రామ్‌తో జాలీగా గడుపుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here