ప్రధానాంశాలు:
- 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? ప్రీ రిలీజ్ ఈవెంట్
- హీరోగా ప్రదీప్ ఎంట్రీ
- ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్‌పై సింగర్ సునీత కామెంట్స్
ఈ సినిమాలో సిద్ శ్రీరామ్, సునీత ఆలపించిన ‘నీలి నీలి ఆకాశం’ ఏ రేంజ్లో హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. వయసు వ్యత్యాసమనేది లేకుండా పతి ఒక్కరినీ పులకరింపజేసింది ఈ సాంగ్. దీంతో యూట్యూబ్ రికార్డులు తిరగరాస్తూ మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టింది. తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ పాట గురించిన కొన్ని విషయాలు పంచుకున్నారు సునీత.
”30 రోజుల్లో ప్రేమించటం ఎలా? అంటే 300 మిలియన్ల వ్యూస్ తీసుకురావడం ఇలా అని ప్రూవ్ చేసిన పాట నేను పాడటం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. పాట పాడేటప్పుడు డెఫినెట్‌గా ఈ సాంగ్ సూపర్ సక్సెస్ అవుతుందనే నమ్మకంతోనే పాడాను. లాక్డౌన్ కారణంగా చాలావరకు సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నా కూడా సినిమాపై నమ్మకంతో థియేటర్స్ ఓపెన్ అయ్యేదాకా ఆగి రిలీజ్ చేస్తున్న బాబు గారికి, అలాగే డైరెక్టర్ గారికి, నాకు ఎంతో ఇష్టమైన ప్రదీప్‌కి, అమృతకి అలాగే ఈ సినిమాకు పనిచేసిన ప్రతిఒక్కరికీ ఆల్ ది బెస్ట్. విడుదల కోసం సంవత్సరం పైగా వెయిట్ చేశారంటే మామూలు విషయం కాదు. నాకు తెలుసు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది” అన్నారు సునీత.
సుకుమార్ శిష్యుడైన మున్నా ఈ ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. చిత్రంలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఎస్.వి. ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్.వి.బాబు నిర్మిస్తున్నారు. టాలీవుడ్లో భారీ నిర్మాణ సంస్థలు అయిన జీఏ2, యూవీ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది.