కేంద్ర ఆయుష్, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ దంపతులు ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో శ్రీపాద్ నాయక్ సతీమణి విజయ మృతి చెందారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శి కూడా మరణించారు. ప్రమాదంలో శ్రీపాద నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయణ్ని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలా వద్ద సోమవారం (జనవరి 11) రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది.