ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ 1,178కిపైగా ఖాతాలను నిలిపివేయాలని ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా, స్ట్రీమింగ్, డిజిటల్ న్యూస్ కంటెంట్‌ను నియంత్రించడానికి ప్రభుత్వం ముసాయిదా నియమాలను రూపొందించింది. ముసాయిదా నిబంధనల ప్రకారం తప్పుడు సమాచారం నివేదించడానికి, దానిని తొలగించమని కోరడానికి ఒక విధానం ఉంటుంది.
కాగా, సోషల్ మీడియా వేదికలు భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని, వాటి ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం హెచ్చరించారు. ట్విటర్‌తో ఖాతాల నిలిపివేతపై వివాదం నెలకొన్న నేపథ్యంలో గురువారం రాజ్యసభలో మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విద్వేషపూరిత సమాచారాన్ని నిలువరించే విషయంలో కేంద్రం ఆదేశాలు అమలుకాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.