తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆప్తురాలు వీకే శశికళ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె సాధారణ స్థితిలోనే ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం (జనవరి 22) రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. కరోనా వైరస్ బారినపడిన శశికళ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆమెను బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం రాత్రి ఆమె ఆరోగ్య క్షీణించినట్లు వార్తలు వచ్చాయి.

హెల్త బులెటిన్
అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో శశికళ.. ప్రస్తుతం పరప్పన జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. శిక్షా కాలం పూర్తి చేసుకొని జనవరి 27న విడుదల కానున్నారు. తమిళనాడు అసెంబ్లీకి మరో 3 నెలల్లోగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన రాజకీయ పునరాగమనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం.