వి.కె. శశికళ.. తమిళనాట సుపరిచితమైన పేరు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలిగా విశేష గుర్తింపు పొందారు. ‘అమ్మ’ అస్తమయం తర్వాత తమిళనాడు సీఎం పదవికి తనే అర్హురాలిగా తెరపైకి వచ్చారు. కానీ, రాజకీయ చదరంగంలో ఓడిపోయారు. అక్రమాస్తుల కేసులో జైలు పాలయ్యారు. ఆమెది ఇక ముగిసిన కథే అని చాలా మంది అనుకున్నారు.
శశికళకు దారి పొడవునా ఘన స్వాగతం లభించింది. రోడ్లకు ఇరువైపులా నిల్చున్న జనం ఆమెకు జేజేలు పలికారు. కొంత మంది ఆమె కాన్వాయ్ వెంట బైక్‌లతో ర్యాలీగా వెళ్లారు. దారి పొడవునా శశికళ తన వాహనం నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు. ఒకచోట తన తండ్రి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ ఓ చిన్నారి సెల్ఫీ దిగడానికి ప్రయత్నించగా.. శశికళ తన వాహనాన్ని స్లో చేయించి, ఆ సెల్ఫీకి సహకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.