Samantha Akkineni: Chiranjeevi: సమంతతో చిరంజీవి అన్‌సీన్ వీడియో.. మెగాస్టార్ నోట గుండెల్ని పిండేసే గోల్డెన్ వర్డ్స్ – chiranjeevi- samantha: sam jam mega episode unseen video viral on social media

0
46


అక్కినేని సమంత హోస్ట్ చేస్తున్న ‘సామ్ జామ్’ ప్రోగ్రాంలో మెగాస్టార్ చిరంజీవి భాగమైన సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రాంలో మెగాస్టార్ లైఫ్ లోని అనేక విషయాలను రాబట్టి ఎంటర్‌టైన్ చేసింది సమంత. ఈ ఎపిసోడ్ క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న టెలికాస్ట్ అయింది. ఇప్పుడున్న హీరోల్లో త‌న సినిమాలను ఏయే హీరోలు రీమేక్ చేస్తే బాగుంటుందనే దగ్గరనుంచి ఎన్నో విషయాలపై ఓపెన్ అయ్యారు చిరంజీవి. వేట సినిమా ఫ్లాప్ అయిన స‌మ‌యంలో దుప్ప‌టి క‌ప్పుకొని ఏడ్చిన సీక్రెట్స్ కూడా చెప్పేశారు. కాగా తాజాగా సామ్ జామ్ మెగా ఎపిసోడ్ అన్‌సీన్ వీడియో అంటూ మరో వీడియో రిలీజ్ చేసి ఆకట్టుకుంది ఆహా టీమ్.

ఈ వీడియోలో మెగాస్టార్ నోట గోల్డెన్ వర్డ్స్ వినిపించాయి. తల్లిదండ్రులు- పిల్లల మధ్య అనుబంధం ఎలా ఉండాలో చెబుతూ గుండెల్ని పిండేశారు చిరంజీవి. అమ్మతో తనకున్న అనుబంధం అంతా ఇంతా కాదని చెప్పిన మెగాస్టార్, అన్ని వేళలా అమ్మకు చేదోడువాదోడుగా ఉండేవాడినని అన్నారు. ”ప్రతి ఒక్కరు కూడా అమ్మ దగ్గర కూర్చొని అమ్మా ఏంటమ్మా ఎలా ఉన్నావు? నాన్న.. నువ్వు నాకోసం ఇంత కష్టపడ్డావు.. తిరిగి నేను నీకేదీ ఇవ్వలేకపోయాను అని చెప్పండి. అప్పుడు వాళ్ళ గుండెలోంచి వచ్చే ఆ వైబ్రేషన్స్‌కి ఏదీ సాటిరాదు. ఎంతో కొంత సమయం వాళ్ళ కోసం, పర్సనల్ టచ్ కోసం వెచ్చించండి. అప్పుడు వాళ్ళు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. అది తిరిగి మీకెంతో తృప్తినిస్తుంది” అని చిరంజీవి చెప్పారు.
బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న పవర్ స్టార్! స్వయంగా ఆయనే కోరడంతో బోయపాటి స్కెచ్..
చిరంజీవి ఇచ్చిన ఈ ల‌వ్‌లీ మెసేజ్‌‌కి సమంత సహా అందరూ తెగ సంతోషపడుతూ చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక మెగాస్టార్ కెరీర్ విషయానికొస్తే.. తన 152వ సినిమాగా ‘ఆచార్య’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here