ప్రధానాంశాలు:
- ‘సోలో బ్రతుకే సో బెటర్’ తరవాత సాయితేజ్ చేస్తోన్న సినిమా
- ‘ప్రస్థానం’ ఫేమ్ దేవ్ కట్టా దర్శకుడు
- రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన మోషన్ పోస్టర్
రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్, అందులోని కాన్సెప్ట్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. జె.బి.ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమాను జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు సోమవారం ప్రకటించారు. అంటే, బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో వస్తోన్న సినిమా తరవాత సాయితేజ్ చిత్రం రాబోతోంది. చిరంజీవి ‘ఆచార్య’ మే 13న వస్తుండగా.. బాలయ్య సినిమా మే 28న విడులవుతోంది. ఈ రెండు సినిమాల తరవాత ‘రిపబ్లిక్’ రాబోతుంది.
విడుదల తేదీ ప్రకటన సందర్భంగా నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ.. ‘‘సాయితేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రిపబ్లిక్’ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. రీసెంట్గా విడుదలైన మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు.
కాగా, ఈ చిత్రంలో సాయితేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా.. జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవ్ కట్టా, కిరణ్ జయ్‌కుమార్ స్క్రీన్‌ప్లే అందిస్తోన్న ఈ చిత్రానికి కథ, మాటలు, దర్శకత్వం దేవ్ కట్టా అందిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కె.ఎల్.ప్రవీణ్ ఎడిటర్.