ప్రధానాంశాలు:
- సాయి ధరమ్ తేజ్ 14వ సినిమా
- దేవాకట్టా దర్శకత్వంలో ‘రిపబ్లిక్’
- సీఎం పాత్రలో రమ్యకృష్ణ
- వివాదాస్పద అంశంపై సాయి ధరమ్ తేజ్ పోరాటం
‘ప్రస్థానం’ ఫేం దేవకట్టా దర్శకత్వంలో ఈ ‘రిపబ్లిక్’ సినిమా రూపొందుతోంది. భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. మెగా మేనల్లుడి కెరీర్లో 14వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ చిత్రాన్ని పొలిటికల్ నేపథ్యంలో రొమాంటిక్ అంశాలు జోడించి తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఇందులో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్ పాత్ర పోషిస్తున్నాడని తెలియగా.. తాజా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమా ఏలూరు సమీపంలో ఉండే కొల్లేరు సరస్సుకు సంబంధించిన వివాదాస్పద కాన్సెప్ట్‌తో సాగుతుందని, కలెక్టర్‌గా పని చేస్తున్న సాయి ధరమ్ తేజ్ ఈ అంశంపై పోరాటం చేస్తారని సమాచారం. కొల్లేరు సరస్సు పూర్వ వైభవం కోసం ఏకంగా సీఎంతో ఫైట్ చేస్తారట మెగా మేనల్లుడు. చిత్రంలో సీఎం పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించనుండటం విశేషం. ఈ చిత్రాన్ని జూన్ 4వ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.